ఒక్కొక్కసారి పొయ్యి మీద గిన్నెలు మాడిపోతు ఉంటాయి. అటువంటి వాటిని తోమడం కష్టంగా ఉంటుంది. పైగా ఎంత తోమినా మాడిపోయిన మచ్చలు, జిడ్డు అలానే ఉంటాయి. ఎప్పుడైనా సరే మాడిపోయిన పాత్రలని తోమడానికి ఇలా చేయండి. నిమ్మరసం ఇందుకు చాలా చక్కగా పనిచేస్తుంది. నిమ్మరసం మరకల్ని వదులుస్తుంది. నిమ్మరసంతో మరకలు పడిన పాత్రలను రుద్దండి తర్వాత సబ్బుతో క్లీన్ చేయండి. ఇలా చేస్తే గిన్నెలు తళతళా మెరిసిపోతాయి. టమాటా సాస్ ని కూడా మీరు ఉపయోగించవచ్చు.
Advertisement
Advertisement
ఒక చెంచా టమాటా సాస్ ని తీసుకుని మురికిగా ఉన్న బౌల్ లో వేసి రుద్దండి. రాత్రంతా అలా ఉంచేసి ఉదయాన్నే క్లీన్ చేస్తే అందులో ఉండే యాసిడ్ కారణంగా మరకలు వదిలి పోతాయి. ఉల్లిపాయతో కూడా క్లీన్ చేయొచ్చు. ఉల్లిపాయ తొక్కల్ని నీటిలో వేసి మరిగించి 20 నిమిషాల పాటు ఉడికించండి. ఇందులో డిష్ వాష్ పోసి క్లీన్ చేస్తే మరకలు అన్ని పోతాయి. వెనిగర్ తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. మాడిపోయిన గిన్నెలో వెనిగర్ వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే సబ్బుతో క్లీన్ చేస్తే సరిపోతుంది. ఉప్పు బేకింగ్ సోడా కూడా గిన్నెలని క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా మీరు మాడిపోయిన వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు.
Also read:
- తాటి బెల్లం తో ప్రయోజనాలు ఎన్నో… ఈ సమస్యలన్నీ పరార్…!
- మహిళలూ.. హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే… ఇవి మస్ట్…!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి మంచి లాభాలుంటాయి