Home » మిక్సర్ గ్రైండర్ ని ఇలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు.. అది కూడా క్షణాల్లోనే..!

మిక్సర్ గ్రైండర్ ని ఇలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు.. అది కూడా క్షణాల్లోనే..!

by Sravya
Ad

మీరు మీ మిక్సర్ గ్రైండర్ ని క్లీన్ చేయాలనుకుంటున్నారా..? ఇలా క్లీన్ చేశారంటే సులభంగా వదిలిపోతుంది. ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మిక్సీని ఎక్కువగా వాడుతున్నారు. ఈజీగా అన్నిటినీ మిక్సీ ద్వారా రుబ్బుతున్నారు. మిక్సీ వచ్చాక క్షణంలో మనం వంటని పూర్తి చేసుకోవచ్చు. చేత్తో రుబ్బక్కర్లేదు. అయితే మిక్సీని వాడడం సౌకర్యంగా ఉంటుంది కానీ క్లీన్ చేయడం మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. తరచూ మిక్సీ ని ఉపయోగిస్తున్నట్లయితే మిక్సర్ గ్రైండర్ జిడ్డుగా మారిపోతుంది. ఈ జిడ్డుని తొలగించడం పెద్ద టాస్క్ ఏ. మిక్సీని ఎప్పటికప్పుడు సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే మురికి పేరుకుపోతుంది. దాని వలన సమస్యలు వస్తాయి.

Advertisement

Advertisement

పైగా మిక్సీని సరిగా క్లీన్ చేయకుండా మళ్ళీ మళ్ళీ వాడడం కూడా ప్రమాదకరం అందుకని ప్రతి రోజూ మిక్సర్ ని బాగా క్లీన్ చేసుకోవాలి. మిక్సర్ ని సబ్బుతో రుద్దకూడదు దాని వలన త్వరగా పాడైపోతుంది. ముందు డిష్ వాష్ ని మిక్సీలో వేసి స్క్రబ్ చేసిన తర్వాత తడి గుడ్డుతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పొడి గుడ్డతో మళ్ళీ ఒకసారి తుడిస్తే సరిపోతుంది. ఒక చిన్న బౌల్ లో బేకింగ్ సోడాని వేసుకోండి అందులో నీళ్లు పోసి పేస్ట్ లాగ చేసుకుని ఈ పేస్టుతో 20 నిమిషాలు రుద్దండి. నీటితో కడిగితే సరిపోతుంది. మిక్సీ క్లీన్ అయిపోతుంది. వాసన కూడా రాదు మిక్సీ తో పాటుగా కేబుల్ స్విచ్ వంటివి కూడా జిడ్డుగా ఉంటాయి వాటిని కూడా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి.

Also read:

Visitors Are Also Reading