Home » ప్రతీ రోజూ యాక్టివ్ గా ఉండాలంటే.. ఇలా చెయ్యండి..!

ప్రతీ రోజూ యాక్టివ్ గా ఉండాలంటే.. ఇలా చెయ్యండి..!

by Sravanthi
Ad

ఎప్పుడూ ఎనర్జీతో యాక్టివ్ గా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయడం మంచిది. ఇలా చేయడం వలన నిత్యం ఎనర్జిటిక్ గా ఉండొచ్చు. రోజు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. సరైన నిద్ర లేకపోతే అలసటగా ఉంటుంది. అలానే నీరసం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు సరైన నిద్ర చాలా ముఖ్యం అలానే ప్రతి విషయానికి ఒత్తిడి పడుతుంటే అలసట ఎక్కువవుతుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకని ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రతిరోజు కాసేపు వ్యాయామం చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఎనర్జీ వస్తుంది.

Advertisement

వాకింగ్ రన్నింగ్ జాకింగ్ వంటివి చేయండి దీంతో ఎక్కువ లాభాలు ఉంటాయి. అలానే ప్రోటీన్, విటమిన్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. అలానే ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. విటమిన్స్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలని డైట్ లో తీసుకోవడం వలన యవ్వనంగా కూడా కనపడతారు. అందంగా ఆరోగ్యంగా ఉంటారు. స్మోకింగ్ చేసే వ్యక్తుల్లో ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. దీని కారణంగా నీరసం అలసట ఎక్కువ అవుతుంది.

Advertisement

Also read:

అందుకని స్మోకింగ్ కి గుడ్ బై చెప్పేసేయండి. ఈ కారణంగా చాలామంది అలసిపోతూ ఉంటారు. ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలి. కాఫీ తాగితే ఇన్స్టంట్ ఎనర్జీ వచ్చి యాక్టివ్ గా తయారవుతాం మోతాదుకు మించి తాగడం వలన లాభాలు కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. ఇంట్లో ఒక్కరే అలా కూర్చోవడం కంటే స్నేహితులతో కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండండి ఇలా చేస్తే నిరుత్సాహం ఉండదు. ఆల్కహాల్ కి కూడా దూరంగా ఉండాలి ఇలా వీటితో యాక్టివ్గా ఎనర్జిటిక్ గా ఉండొచ్చు.

ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading