శ్రీమహావిష్ణువు దశావతారాల్లో అత్యంత విశిష్ట కలిగిన అవతారం శ్రీరాముడు అయితే శ్రీరాముడికి చాలా పేర్లు ఉన్నాయి. శ్రీరాముడు చైత్రమాసంలో శుక్లపక్షం నవమి తేదీ నాడు జన్మించారు శ్రీరాముడిది కర్కాటక రాశి. ఈ మహాపురుషుని జాతకంలో నాలుగు కేంద్ర స్థానాలలో ఉచ్చమైన గ్రహాలు ఉన్నాయి అవి పంచ మహాపురుష రాజయోగాన్ని సూచిస్తాయి. అయితే అసలు శ్రీరాముడు అనే పేరు ఎలా వచ్చింది అనేది చూస్తే ఓం నమో నారాయణ అనే అష్టాచారాల నుండి ”ర” అనే అక్షరం పంచాక్షరాల్లోని నమశ్శివాయ అనే అక్షరంలో ”మ” అక్షరం నుండి రామగా ఏర్పడిందని పండితులు చెప్పడం జరిగింది. దశ అవతారాలులో ఏడవ అవతారం శ్రీరాముడి అవతారం.
Advertisement
Advertisement
ప్రతి సంవత్సరం చైత్రమాసంలో నవమి తిధి నాడు శ్రీరాముడు జన్మించినందున శ్రీరామనవమి పండుగను మనం చేసుకుంటాము. ఒక కొడుకుగా భర్తగా రాజుగా తండ్రిగా అన్ని పాత్రలో కూడా నిజాయితీగా వ్యవహరించారు శ్రీ రామచంద్రుడు. తన రాజ్యంలో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు రాముడు. ఎవరో ఒక వ్యక్తి చిన్న మాట అనడం వలన సీతాదేవిని అగ్నిలోకి దూకమని చెప్పారు రాముడు అయితే తను నిప్పు అని అగ్ని దేవుడు చెప్పడంతో అందరినోళ్లు కూడా మూత పడిపోయాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!