భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటికి 75 ఏళ్లు అవుతోంది. ఇక దీంతో దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇదే రోజు పోస్టల్ పిన్‌కోడ్ ఆవిర్భవించిందని చాలా తక్కువ మందికే తెలుసు. ఇవాళ గోల్డెన్ జూబ్లీని పోస్టల్ పిన్ కోడ్ కూడా సెలబ్రెట్ చేసుకుంటోంది. పోస్టల్ సర్వీస్ కి సంబంధించిన పిన్ కోడ్ ఆవిర్భవించి నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పోస్టల్ ఇండెక్స్ నెంబర్ ను పిన్ కోడ్ లేదా ఏరియా కోడ్ లేదా జిప్ కోడ్ అని పిలుస్తుంటారు.
1972 ఆగస్టు 15న పోస్టల్ పిన్‌కోడ్ ప్రారంభమైంది. ముఖ్యంగా దేశంలోని పలు ప్రాంతాల పేర్లు ఒకేలా ఉండడం, స్థానిక భాషల్లో చిరునామాలు రాస్తుండడంతో అర్థమయ్యేవి కాదు. దీనికి పరిస్కారంగా అప్పటి కేంద్ర సమాచార శాఖ సెక్రెటరీ శ్రీరామ్ బికాజీ వేలంకర్ ఆరు అంకెల పిన్‌ను ప్రవేశపెట్టారు. పిన్‌కోడ్‌లో ఆరు అంకెలు కనిపిస్తుంటాయి. సంస్కృత భాషా రంగంలో చేసిన కృషికి శ్రీరామ్ భికాజీ వేలంకర్ రాష్ట్రపతి అవార్డును కూడా అందుకున్నారు. 1999లో ముంబైలో మరణించారు. పిన్‌కోడ్‌లను ఏరియా కోడ్ లు లేదా జిల్లా కోడ్ లు అని కూడా పిలుస్తారు.
Advertisement
Advertisement
పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ పోస్ట్ మ్యాన్ కి ఒక లేఖ లేదా ప్యాకేజీని గుర్తించి, ఉద్దేశించిన గ్రహీతకు అందించడాన్ని మరింత సులభతరం చేస్తుంది. పిన్ కోడ్‌లో కనిపించే ఆరు అంకెల్లో మొదటి అంకె జోన్‌ను సూచిస్తుంది. రెండవ అంకె ఉప జోన్‌ను, మూడవ అంకె జిల్లాను సూచిస్తుంది. చివరి మూడు అంకెలు జిల్లాలోని వ్యక్తిగత పోస్టాఫీసులకు కేటాయించబడతాయి. 1972 ఆగస్టు 15న పిన్ కోడ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టినప్పుడు ఆ సమయంలో భారతదేశం 8 భౌగోళిక ప్రాంతాలుగా విభజించబడింది. 9వ జోన్‌ను ఆర్మీ పోస్టల్ సర్వీస్‌కి రిజర్వ్ గా ఉంచారు. నేడు దేశంలో మొత్తం 19101 పిన్ కోడ్‌లున్నాయి. ఇందులో ఆర్మీ పోస్టల్ సర్వీస్ ఉండదు. పిన్ కోడ్ సాయంతో వస్తువుల పంపిణీ సులభతరంగా మారింది. ప్రస్తుతం సరైన చిరునామాకు ఉత్తరాల పంపిణీ, వస్తువుల పంపిణీ కూడా చాలా సులభంగా జరుగుతోంది.
Also Read :
మగవారిలో ఈ 4 అలవాట్లు ఉంటే ఆడవారు అస్సలు తట్టుకోలేరు..3వది ఇంపార్టెంట్..!!
నాగార్జున పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..!