మనదేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. దాదాపు అన్ని అధికారిక పనులకు ప్రస్తుతం ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఎక్కడికైనా వెళ్లాలన్నా…? ఉద్యోగం కోసం అప్లై చేయాలన్నా..? ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నా ఆధార్ తప్పనిసరైంది. భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవడమైనా ఆఖరికి వ్యాక్సిన్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఆధార్ కార్డులు తీసుకున్న సమయంలో హడావిడి కారణంగా దాదాపు ప్రతి ఒక్కరి ఆధార్ కార్డులో ఏదో ఒక మిస్టేక్ జరిగింది. పుట్టిన తేదీ, ఇంటిపేరు ఇలా వివరాలు తప్పుగా పడ్డాయి. అయితే ప్రతి ఒక్కరికీ ఆధార్ తప్పనిసరి కాబట్టి అలాంటి తప్పులను సరిదిద్దు కుంటేనే మంచింది.
Advertisement
కానీ ఆధార్ కార్డ్ లో తప్పులను ఎలా సరిచేసుకోవాలో తెలియక చాలామంది కంగారు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆధార్ లో పుట్టిన తేదీ, ఇంటి పేరు, అడ్రస్ లను ఎలా మార్చుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. యూఐడీఏఐ రూల్స్ ప్రకారం గా ఒక వ్యక్తికి ఆధార్ కార్డు వచ్చిన తర్వాత అతని పేరును రెండు సార్లు మాత్రమే మార్చుకోవడానికి వీలు ఉంటుంది. తర్వాత పేరు లో మార్పులు చేసుకోవడం కుదరదు. అంతేకాకుండా ఒకసారి ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత పుట్టిన తేదీ ఎంట్రీ లో తప్పులు ఉంటే కానీ మార్చడం కుదరదు.
Advertisement
also read : ప్రామిసరీ నోట్ ఎలా రాయలంటే? ఇవి పాటించక పోతే డబ్బు గోవిందా!
అందువల్లే ఆధార్ కార్డు తీసుకున్నప్పుడే డేట్ అఫ్ బర్త్ ను జాగ్రత్తగా ఎంటర్ చేయించుకోవాలి. ఆధార్ కార్డు లో కొంతమంది అడ్రస్ కూడా మార్చుకోవాలి అనుకుంటారు. అయితే యూఐడీఏఐ ప్రకారం ఆధార్ కార్డులో అడ్రస్ ఒకసారి మాత్రమే మార్చుకోగలరు. ఇక ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే రేషన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఐడి కార్డు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, ఆస్తిపన్ను లాంటి డాక్యుమెంట్ లు అవసరమవుతాయి.