Home » సూర్యకాంతం ఆస్తులను ఆ లాయర్ ఎలా మోసం చేసి కాజేసాడో తెలుసా?

సూర్యకాంతం ఆస్తులను ఆ లాయర్ ఎలా మోసం చేసి కాజేసాడో తెలుసా?

by Srilakshmi Bharathi
Ad

తెలుగు ప్రేక్షకులు అలనాటి తరం నటి, గుండమ్మత్త సూర్యకాంతాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. సూర్య కాంతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న జన్మించారు. సినిమా రంగంలో ఎనలేని కీర్తిని గడించిన ఆమె గడసరి అత్తగా, గయ్యాళి అత్తగా పోషించిన పాత్రలు లెక్కలేనన్ని. సినిమాల్లో ఆమె పాత్ర ఉందంటే చాలు మిగతా భర్త, కోడళ్ళు, ఇరుగు పొరుగు వారితో సహా అందరు భయపడుతూనే ఉంటారు. అత్తంటే రాక్షసి అనే ముద్ర ఆమె అత్తగా నటించిన పాత్రల్లో కనిపిస్తుంది. కానీ స్వతహాగా ఆమె చాలా మృదు స్వభావి అని చెబుతూ ఉంటారు.

Suryakantham-photos

Advertisement

 

అందుకే ఆమెను అభిమానించే వారు ఇండస్ట్రీ బయటే కాదు.. ఇండస్ట్రీలో కూడా చాలా మందే ఉన్నారు. సినిమాల్లో ఎంత బెదరగొట్టినా బయట కనిపిస్తే మాత్రం ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారట. అటువంటి నటి అంత ఆస్తి సంపాదించుకున్నా కూడా.. చివరి రోజుల్లో చాలా కష్టాలు పడాల్సి వచ్చిందట. వాస్తవానికి సూర్యకాంతం హీరోయిన్ గా నటించాల్సి ఉందట. కానీ, ఓ కార్ యాక్సిడెంట్ లో ఆమెకు అయిన ముఖ గాయాల వలన ఆమెకు వచ్చిన హీరోయిన్ అవకాశాలు చేజారిపోయాయి.

Advertisement

దానితో ఆమె సహాయక పాత్రలే చేస్తూ వచ్చారు. వీటిల్లో ఎక్కువగా గయ్యాళి ఆత్త పాత్రలే చేస్తూ వచ్చారు. 1953లో వచ్చిన ‘కోడరికం’ సినిమాతో సూర్యకాంత గయ్యాళి అత్తకు ట్రేడ్ మార్క్ గా నిలిచారు. ఆ తరువాత ‘మాయాబజార్‌’, ‘దొంగరాముడు’, ‘భార్యాభర్తలు’ గుండమ్మ కథ, ‘అత్తా ఒకింటి కోడలే’, ‘ఇల్లరికం’ వంటి సినిమాలు చాలానే చేసారు. రెమ్యునరేషన్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండే సూర్యకాంతం అప్పట్లోనే కొన్ని ఆర్ధిక వ్యవహారాలు కూడా చూసుకునేవారట. ఆమె 1950 లో హై కోర్ట్ జడ్జి పెద్దిభోట్ల చలపతి రావు గారిని పెళ్లి చేసుకున్నారు. వారికి పిల్లలు లేరు. దీనితో.. సూర్యకాంతం తన తదనంతరం తన ఆస్తిని తన సోదరులకు ఇవ్వలసిందిగా తన లాయర్ ని కోరింది. కానీ ఆ లాయర్ సూర్యకాంతంను మోసం చేసి.. ఆస్తి అంతా తన పేరున రాసుకున్నాడు. ఈ విషయం సూర్యకాంతం మరణించిన తరువాత వెలుగు లోకి వచ్చింది. విషయం తెలుసుకున్న సూర్యకాంతం సోదరుడు గుండెపోటుతో మరణించాడు. అతను చేసింది మోసమే అయినా.. చట్ట ప్రకారం చేయడానికి ఏమీ లేకపోవడంతో సూర్యకాంతం ఆస్తి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading