Home » డాక్టర్ అవ్వాల్సిన కోటా యాక్టర్ ఎలా అయ్యారు..? ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?

డాక్టర్ అవ్వాల్సిన కోటా యాక్టర్ ఎలా అయ్యారు..? ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?

by Srilakshmi Bharathi
Ad

సినిమా అన్నాకా హీరోకి ఉండే డిమాండ్ తో పాటు కమెడియన్స్, విలన్స్ కి కూడా డిమాండ్ ఉంటుంది. అయితే.. ఎవరి ఇంపార్టెన్స్ వారికే ఉంటుంది. విలన్స్, కమెడియన్స్ పాత్రల ద్వారా కూడా సూపర్ సక్సెస్ కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు.. ఇండస్ట్రీలో టాప్ విలన్ గా పేరు సంపాదించుకున్న వారిలో కోటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయనకు అభిమానులు చాలా మందే ఉన్నారు. అయితే.. ప్రస్తుతం వయసు ఎక్కువ అవ్వడంతో ఆయన ఇండస్ట్రీకి దూరం అయ్యారు.

Advertisement

అయితే.. అప్పుడప్పుడు యు ట్యూబ్ ఛానెల్స్ వారి ఇంటర్వ్యూలలో కోటా శ్రీనివాస రావు కనిపిస్తూనే ఉంటారు. ఈ ఇంటర్వ్యూల ద్వారా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటూ ఉంటారు. నిజానికి ఆయన యాక్టర్ అవడం కంటే ముందు డాక్టర్ అవ్వాల్సి ఉందట. సినిమాలపై ఉన్న ఆసక్తి కొద్దీ.. తన డాక్టర్ చదువుని పక్కన పెట్టి ఇండస్ట్రీ వైపుకి వచ్చేసారుట. ఆయన తండ్రి వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో.. తన పిల్లలను కూడా డాక్టర్లని చేయాలనీ ఆయన అనుకున్నారు. పెద్ద కుమారుడు డాక్టర్ చదువుపై ఆసక్తి లేక నాటకాల వైపుకు వెళ్లిపోయారు.

Advertisement

ఇక కోట శ్రీనివాసరావు ని పట్టు బట్టడంతో.. ఆయన మెడికల్ కాలేజీలో చేరారు. అయితే.. ఆయన కూడా మధ్యలో అది వదిలేసి సినిమాల వైపు వచ్చేసారు. తన అన్న నాటకాల్లో రాణిస్తుంటే.. అందరు ఆయన్ని పొగిడేవారు. అలా అన్నయ్య ని చూసి కోటా శ్రీనివాసరావు కూడా నాటకాలు వేయడం స్టార్ట్ చేసారు. ఆయన నాటకాలు చూసిన చిరంజీవి కోట శ్రీనివాసరావుకు అవకాశం ఇచ్చారు. మెడిసిన్ చదువు మధ్యలో వదిలేసి.. డిగ్రీ చేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం తిరిగారు. ఓ వైపు డిగ్రీ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగం సంపాదించి కూడా సినిమాల్లో ప్రయత్నించడం మానలేదు. అవకాశాలు వచ్చినప్పుడు ఉద్యోగంలో సెలవులు పెట్టి షూటింగ్ కి వెళ్లేవారు. అలా నటించిన ప్రతిఘటన సినిమా ఆయన కెరీర్ నే మార్చేసింది. ఆ తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా ఇండస్ట్రీలోనే స్థిరపడ్డారు. మొదటగా కోటా గారు ప్రాణం ఖరీదు సినిమాలో నటించారు. క్లైమాక్స్ లో గుంపులో ఓ వ్యక్తిగా కోటా కనిపిస్తారు. అందుకుగాను ఆయనకు వంద రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారట. అదే ఆయన మొదటి పారితోషికం అని తెలుస్తోంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading