Home » Glenn Maxwell : మాక్స్ వెల్ కు ఇండియాకు ఉన్న సంబంధం ఏంటి..అతని భార్య ఎవరో తెలుసా ?

Glenn Maxwell : మాక్స్ వెల్ కు ఇండియాకు ఉన్న సంబంధం ఏంటి..అతని భార్య ఎవరో తెలుసా ?

by Bunty

ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ పేరు చరిత్రలో నిలవడం ఖాయం. వన్డే క్రికెట్ చరిత్రలోనే ద బెస్ట్ ఇన్నింగ్స్ ఆడేశాడు. మ్యాక్స్వెల్ ఇప్పుడు ఓ రకంగా మన ఇండియన్ ఇంటి అల్లుడు. తన భార్య పేరు విని రామన్. ఆమెది భారతీయ మూలాలే. చెన్నైలో ఆమె మూలాలు ఉన్నాయి.

How Glenn Maxwell Met Indian-Origin Vini Raman

 

గతేడాది వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. క్రిస్టియన్ మరియు భారతీయ సాంప్రదాయాలలో పెళ్లి చేసుకున్నారు.  ఇక వీరికి సెప్టెంబర్ లో ఒక బాబు కూడా జన్మించాడు. అతని పేరు లోగన్ మావెరిక్ మాక్స్వెల్. ఓ రకంగా ఇండియన్ ఇంటి అల్లుడు అయిన మ్యాక్స్వెల్ ఇండియాలో జరుగుతున్న ప్రపంచకప్ లో చారిత్రక ఇన్నింగ్స్ ఆడడం చాలా అద్భుతంగా ఉంది.

మొన్నటి మ్యాచ్ లోనే కాదు కొన్నాళ్ల క్రితం నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా డెత్ ఓవర్లలో రచ్చ లేపి అద్భుతమైన సెంచరీ సాధించాడు. మొన్న మ్యాక్స్వెల్ సూపర్ ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా సెమీస్ లోకి అడుగు పెట్టింది. కాగా రెండు రోజుల కిందట ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫైట్ జరిగిన సంఘటన తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ 291 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించడంలో ఆస్ట్రేలియా తడబడింది. ఈ నేపథ్యంలోనే 128 బంతుల్లో 201 పరుగులు చేసి ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చాడు మ్యాక్స్ వెల్.

 

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading