Home » ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారిందంటే ?

ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారిందంటే ?

by Bunty
Ad

హనుమంతుని జీవితం గురించి వివిధ గాధలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. హనుమంతుడు, హనుమాన్, ఆంజనేయుడు ఇలా రకరకాల పేర్లు కలిగాడు ఆ ఆంజనేయస్వామి. ఏ పేరుతో పిలిచినా పలికే హనుమంతుడికి భక్తులు చాలా ఎక్కువే. ఆంజనేయుడిని ఎక్కువగా పూజించడానికి ముఖ్య కారణం, అతని నిజాయితీ, మానవత్వం, బలం, జ్ఞానం నిజమైన భక్తిని కలిగి ఉండటమే.

Advertisement

అయితే, ఆంజనేయుడి వాహనం ఒంటె అని పరాశర సంహితలో పేర్కొన్నారు. మనోవేగంతో సమానంగా ప్రయాణించే వాయు పుత్రుడి వాహనాన్ని గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడ ప్రస్తావించలేదు. సీతాదేవిని వెతుకుతూ పంపానది తీరానికి రామలక్ష్మణులు చేరుకున్నప్పుడు, సుగ్రీవుడు వాళ్ళను చూసి భయపడతాడు. ధనుర్బాణాలు ధరించి వస్తున్న ఈ వీరులు ఎవరో తెలుసుకొని రమ్మని హనుమాను పంపిస్తాడు.

Advertisement

ఆంజనేయుడు మొదటిసారి శ్రీరాముని కలుసుకున్నది పంపానది తీరంలోనే! ఈ ప్రాంతం హానుమకు ఎంతో నచ్చిన ప్రదేశం. ‘పంపాతీర నివాసాయ గంధమాదన వాసినే’ అని స్వామిని కీర్తిస్తారు భక్తులు. అయితే, ఈ నది తీరం వెంబడి ఏడారిని తలపించేలా దట్టమైన ఇసుక మేటలు ఉండేవి. హనుమ ఈ ప్రాంతంలో విహరించడానికి సౌకర్యంగా ఉండటం కోసం, ఇసుకలో తేలికగా నడవగలిగే ఒంటెను సుగ్రీవుడు, వాయుపుత్రుడికి బహుమానంగా ఇచ్చాడని ప్రతితి. అంతేకాదు, హనుమంతుడి ధ్వజంపైన కూడా ఒంటె గుర్తే ఉంటుంది. అందుకే రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు వృషభం వంటి బలిష్టమైన ఒంటెను వాహనంగా ఎంచుకున్నాడని కూడా పెద్దలు చెబుతారు.

READ ALSO : పదో తరగతి పాసైన వారికి గుడ్‌ న్యూస్‌..తెలంగాణలో రేషన్‌ డీలర్‌ ఉద్యోగాలు..!

Visitors Are Also Reading