కొందరికీ హీరోలకు, హీరోయిన్స్ కి, దర్శకులకు అలాగే సంగీత దర్శకులకు కొంత సమయం అంటూ ఒకటి నడుస్తుంది. ఇప్పుడు ఎస్.ఎస్.థమన్ సమయం నడుస్తుందనే చెప్పవచ్చు. ప్రస్తుతం స్టార్ హీరోల ప్రాజెక్ట్స్ అన్ని థమన్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఓజీ.. మహూష్ బాబు గుంటూరు కారం సినిమాలకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఒకప్పుడు బెస్ట్ మ్యూజిక్ అంటే.. ఎక్కువగా దేవీశ్రీప్రసాద్ అందించేవాడు. ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్, దేవిశ్రీప్రసాద్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. రీసెంట్ గా థమన్ చేసిన భగవంత్ కేసరి మూవీ సూపర్ హిట్ అయింది.
Advertisement
ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ తో పాటు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందించాడు థమన్. మహేష్ బాబు సర్కారు వారిపాట మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి సంబంధించి… ఆ సినిమాకి థమన్ రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని చెప్పి చాలా ట్రోల్స్ వినిపించాయి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో థమన్ దీనిపై స్పందిస్తూ.. చచ్చిన శవాన్ని తీసుకొచ్చి బతికించమంటే ఎలా బతికిస్తాం అని.. ఓ మంచి కాన్సెప్ట్ ఉంటూ మ్యూజిక్ ఆటోమేటిక్ గా అదే వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. ఒక మంచి సినిమాకి మంచి మ్యూజిక్ అడుగుతుందని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని కొందరూ సమర్థిస్తుండగా.. మరికొందరూ ట్రోల్స్ చేస్తున్నారు.
Advertisement
ప్రస్తుతం అనిరుధ్ ప్రభంజనం కొనసాగుతుంది. కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో జైలర్ మూవీని ఓ రేంజ్ లో నిలబెట్టాడు. బీస్ట్, మాస్టర్, జైలర్ వంటి సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఒక సినిమాకి బ్యాక్ గ్రౌండ్ ఎంత ప్లస్ అవుతుందో నిరూపించాడు అనిరుధ్. ఇక ఈ విషయంలో థమన్ పై కొందరూ ట్రోల్స్ చేస్తున్నారు. కంటెంట్ బాగుంటే.. థమనే కాదు కింగ్ సినిమాలో జై సూర్య కూడా కొడతాడు అనే రేంజ్ లో ట్రోల్ చేయడం విశేషం.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.