Home » మళ్లీ పెరిగిన వంట నూనెల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

మళ్లీ పెరిగిన వంట నూనెల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Anji
Ad

సాధారణంగా ఈ మధ్య కాలంలో నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వంట నూనెల విషయంలో అయితే మరీ ఎక్కువగా పెరుగుతున్నాయి.  కేవలం నెలరోజుల వ్యవధిలోనే వేరుశనగ నూనె ధర లీటరుకు రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగింది.  ఫిబ్రవరి 26 వరకు వేరుసెనగ నూనె లీటర్ కు రూ.108 లకు చేరుకుంది.  ఫామ్ ఆయిల్ ధర లీటర్ కి రూ.3 నుంచి రూ.5 వరకు ఎగబాకి ప్రస్తుతం రూ.104లకు చేరుకుంది. పొద్దు తిరుగుడు నూనె లీటరుకు రూ.135ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దేశీయంగా నూనె గింజల పంటల ఉత్పత్తి తగ్గడం, విదేశాల్లో వేరుశనగ నూనెకు అధిక డిమాండ్ పెరగడం.. వంటి కారణాల వల్ల ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత నుంచి భారతదేశం నుంచి చైనా వేరుశనగ దిగుమతులని పెంచింది.  ఇక ఆ దేశంలో వేరుశనగ నూనెకు  ఎక్కువ డిమాండ్  పలుకుతుంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 104 లక్షల టన్నుల వేరుశనగ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా.. 100 లక్షల టన్నులే వస్తుందని ఈనెల 14న విడుదలైన రెండో ముందస్తు అంచనాల్లో వెల్లడైంది. దేశంలో 9 రకాల నూనె గింజల పంటలు కలిపి 423 లక్షల టన్నులను లక్ష్యంగా నిర్ణయించగా, మూడో ముందస్తు అంచనాల ప్రకారం.. 400 లక్షల టన్నుల మేర వస్తుందని గుర్తించారు. దేశంలో వేరుశనగ సాగు, ఉత్పత్తిలో గుజరాత్ అగ్రస్థానంలో నిలుస్తుంది. మొత్తం ఉత్పత్తిలో 45 శాతం పంట ఆ రాష్ట్రంలోనే పండిస్తున్నారు. తర్వాత రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి.

Advertisement

Also Read :  తెల్ల శనగలతో మీ పొట్ట కొవ్వు కరిగించవచ్చనే విషయం మీకు తెలుసా ?

గుజరాత్ లోని గోండల్ ప్రాంతంలో 100కు పైగా నూనె తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫెడ్ కూడా అక్కడి నుంచే నూనెను దిగుమతి చేసుకొని విజయ బ్రాండ్ పేరుతో విక్రయిస్తోంది. అయితే ఈ ఏడాది గుజరాత్ లో వేరుశనగ పంట ఉత్పత్తి తగ్గినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో క్వింటాల్ కు రూ.7400 నుంచి రూ.8400 వరకు ధర పలుకుతోంది. సన్ ఫ నూనె లీటర్ ధర రూ.135 వద్ద ఉంది. దిగుమతులు తగ్గిపోవడం, ఎగుమతులపై ఇండోనేసియా ఆంక్షలు విధించడం కారణంగా దేశీయంగా వంట నూనెల ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read :  టమోటాలు ఎక్కువగా తింటున్నారా..? అయితే మీకు ఆ ప్రమాదం పొంచి ఉన్నట్టే..!

Visitors Are Also Reading