Home » ‘వీర సింహ రెడ్డి’ ట్రైలర్ లో మనకుకనిపించిన ఈమె ఎవరో తెలుసా ?

‘వీర సింహ రెడ్డి’ ట్రైలర్ లో మనకుకనిపించిన ఈమె ఎవరో తెలుసా ?

by Bunty
Ad

బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం వీరసింహారెడ్డి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక జనవరి 6న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. మూవీ టీం అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

బాలయ్య, శృతిలతో పాటు మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ కూడా హైలైట్ గా నిలిచింది. పూల డ్రెస్సులో కనిపించిన హనీ అందరు చూపులు తనవైపు తిప్పుకుంది. స్టేజి మీద ‘మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయే’ పాటకు స్టెప్పులేసింది. బాలయ్య కూడా ఆమెతో మలయాళం లో మాట్లాడి కామెడీ చేశాడు. ఇదంతా చూసి, అరే ఇంత అందంగా ఉంది, ఎవరి ముద్దుగుమ్మ? అంటూ హనీ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేసేసారు తెలుగు ఆడియన్స్. కేరళలో పుట్టి పెరిగిన 31 సంవత్సరాల హాని, 17 ఏళ్ల క్రితం అంటే 2005లో తన 14వ ఏటనే నటిగా ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

మాతృభాష మలయాళం లో తొలి సినిమా చేసిన తర్వాత 2007లో తమిళంలోనూ అడుగు పెట్టింది. అదే ఏడాది ‘ఆలయం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది. కన్నడలోనూ నటించిన హాని ‘ఈ వర్షం సాక్షిగా’ అనే మరో మూవీ చేసిన తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఇంకో హైలైట్ ఏంటంటే హనీ రోజ్ గోల్డ్ పాత్రలకు కూడా కేరాఫ్ అడ్రస్. గతేడాది రిలీజ్ అయిన మాన్ స్టర్ మూవీలో మంచు లక్ష్మితో కలిసి లిప్ లాక్ సీన్స్ చేసే షాక్ ఇచ్చింది. ఆమె వీరసింహారెడ్డిలో, వీరసింహారెడ్డి భార్య మీనాక్షి రెడ్డి క్యారెక్టర్ చేస్తుందని తెలుస్తోంది.

read also  : విజయ్ కి బిగ్ షాక్ “వారసుడు” స్టోరీ లీక్.. స్టోరీ కొత్తగా ఉందిగా !

Visitors Are Also Reading