Home » హిట్ -2 ఫస్ట్ గ్లింప్స్ విడుదల…కూల్ కాప్ గా ఆకట్టుకున్న అడవి శేష్…!

హిట్ -2 ఫస్ట్ గ్లింప్స్ విడుదల…కూల్ కాప్ గా ఆకట్టుకున్న అడవి శేష్…!

by AJAY
Ad

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హిట్ -2. సెకండ్ కేస్ అనే టాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి యువ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నాచురల్ స్టార్ నాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ రోజు అడవి షేష్ పుట్టినరోజు సంధ్భంగా ఈ చిత్రం నుండి ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కూల్ అండ్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ గా అడవి శేషు ఆకట్టుకున్నారు. ఇక ఫస్ట్ గ్లింప్స్ ఆధ్యంతం ఎంతో ఆసక్తిగా కొనసాగింది.

Advertisement

Hit 2 first glimpse released

Hit 2 first glimpse released

ఈ వీడియోలో అడవి శేషు పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టారు. పోలీస్ యూనిఫాం వేసుకుని ఓ జాగిలాన్ని వెంట పెట్టుకుని అడవి శేష్ కేసుని ఎలా చేదించారు అనే దిశగా అడుగులు వేస్తున్నట్టు వీడియోలో కనిపించింది. ఇక సినిమాలో అడవి శేష్ కేసును ఎలా చేదించారు ఉన్నది చూపించబోతున్నట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే హిట్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సీన్ నటించారు. కానీ హిట్ 2 లో విశ్వాక్ సేన్ కాకుండా అతడి ప్లేస్ లో అడవి శేష్ హీరోగా నటిస్తున్నారు. హిట్ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. మరి హిట్ 2 కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Advertisement

Visitors Are Also Reading