Home » ప్రీరిలీజ్ బిజినెస్ లో బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన పుష్ప…టాప్ 7లో ఉన్న సినిమాలీవే…!

ప్రీరిలీజ్ బిజినెస్ లో బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన పుష్ప…టాప్ 7లో ఉన్న సినిమాలీవే…!

by AJAY
Ad

కొన్ని సినిమాలపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొంటాయి. సినిమా టీజర్.. ట్రైలర్ ను బట్టి సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అవుతాయి. దాంతో ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరుగుతుంది. అలా టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….

Advertisement

ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి పార్ట్ -2 కు 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో టాలీవుడ్ లోనే ఈ సినిమా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాల్లో నంబర్ వన్ గా నిలిచింది.

అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాల్లో రెండో స్థానంలో కూడా ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా నిలిచింది. ఈ సినిమాకు 270కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మెగాస్టార్ హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా కు 187.25 కోట్ల రిలీజ్ బిజినెస్ జరిగింది.

Advertisement

అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప. ఈ సినిమా పార్ట్ 1 కు ప్రపంచవ్యాప్తంగా 144.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో బాహుబలి 1, స్పైడర్, అజ్ఞాతవాసి సినిమాల రికార్డులను పుష్ప చెరిపివేసింది.

మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ సినిమా కు ప్రపంచ వ్యాప్తంగా 124.8 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా అత్యధిక ప్రీ రిలీజ్ జరిగిన చిత్రాల్లో 5వ స్థానంలో నిలిచింది.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమాకు కు ప్రపంచవ్యాప్తంగా రూ.124.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి చిత్రం పార్ట్ 1 కు రూ. 118 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

Visitors Are Also Reading