భారతదేశంలో ఇప్పటివరకు కోర్టులు ఇచ్చిన తీర్పులు ఒక ఎత్తయితే.. ఇప్పుడు రాజస్థాన్ హై కోర్టు ఇచ్చిన ఓ తీర్పు ఆసక్తికరంగా, ఆశ్చర్యంగా ఉండడం విశేషం. ముఖ్యంగా భార్యను గర్భవతిని చేసేందుకు రాజస్థాన్ హైకోర్టు ఓ వ్యక్తికి 15 రోజుల పెరోల్ మంజూరు చేయడం విశేషం. దేశ ప్రజలు ఇదొక ఆసక్తికరమైన తీర్పుగా భావిస్తున్నారు.
Advertisement
ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్ హైకోర్టు ఏప్రిల్ 5, 2022న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అరుదైన సంఘటనలు రాజస్థాన్ హైకోర్టు తన భార్యను గర్భవతిని చేయడానికి ఒక వ్యక్తికి 15 రోజుల పెరోల్ మంజూరు చేసినది. ఈ మేరకు జోద్ పూర్ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సంతానం తన హక్కుపై తన భర్తను విడుదల చేయాలంటూ 34 ఏళ్ల నంద్ లాల్ భార్య రేఖ వేసిన పిటిషన్ పై న్యాయమూర్తి సందీప్ మెహతా, ఫర్జాంద్ అలీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. నంద్ లాల్ జీవిత భాగస్వామి నిర్దోషి అని, వైవాహిక జీవితాలతో ముడి పడి ఉన్న ఆమె భావోద్వేగ అవసరాలు ఆ వ్యక్తి జైలులో ఉన్న కారణంగా ప్రభావితమయ్యాయని న్యాయమూర్తులు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Advertisement
చట్టపరమైన అంశాన్ని ప్రదర్శిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇచ్చినట్టుగా సంతానం పొందే హక్కును జీవించే ప్రాథమిక హక్కు తో కోర్టు అనుసంధానించింది. చట్టం ద్వారా ఏర్పరచబడిన ప్రక్రియ ప్రకారం.. తప్ప ఏ వ్యక్తి తన జీవితాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదు అని భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది. ఆ పరిధిలో ఖైదీలు కూడా ఉన్నారని న్యాయమూర్తులు వెల్లడించారు. నందులాల్ 2019లో రాజస్థాన్ లోని భిల్వారా కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. అజ్మీర్ సెంట్రల్ జైలులో ఉనన ఇతనికి 2021లో 20 రోజుల పెరోల్ మంజూరు చేయబడినది. జైలు ప్రాంగణంలో నందులాల్ ప్రవర్తన చాలా బాగుందని కోర్టు పేర్కొన్నది.
Also Read :
కలలో ఈ దేవుడు కనిపించాడా.. అయితే మీకు జరగబోయేది ఇదే..!!
ఇతరుల దగ్గర ఈ వస్తువులు అస్సలు తీసుకోకండి.. తీసుకున్నారో జీవితాంతం కష్టాలే..!!