సోషల్ మీడియాలో సంచలనమైనటువంటి కిలీపాల్‌ను టాంజానియాలోని భారత హై కమిషన్ సత్కరించింది. కిలిపాల్ టాంజానియాకు చెందిన కంటెంట్ సృష్టికర్త. అతను భారతీయ సినిమాలలోని ప్రముఖ పాటలను లిప్ సింక్ చేయడం కోసం ఇతర సామాజిక ఫ్లాట్ ఫారమ్‌లలో ప్రసిద్ధి చెందారు. ఇతను భారత్‌లో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నారు. తాజాగా కిలిపాల్‌ను సత్కరించినట్టు భారత హై కమిషన్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది.
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి
Advertisement
కిలీపాల్‌కు ఇన్‌స్టాగ్రామ్ లో 2 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. భారత్‌లో ఆయుష్మాన్ ఖురానా, గుల్ పనాగ్, రిచా చద్దా వంటి చాలా మంది నటీనటులు అతన్ని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా హిందీ సినిమా పాటలకు లిప్ సింక్ స్కిల్స్‌ను కూడా వీడియోల్లో ప్రదర్శించాడు. కిలీపాల్ వీడియోల్లో షేర్షా చిత్రం నుంచి రాతన్ లంబియన్ ఇందులో అతని సోదరి నీలిమా కూడా కనిపించింది. చాలా మంది నెటిజన్లు దీనిని ఇష్టపడ్డారు. కిల్‌పాల్ తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. తన సాంప్రదాయ దుస్తులతో వీడియోలను పోస్ట్ చేసినందుకు సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసించారు.
Advertisement
ముఖ్యంగా కేశవ్ ఝా వంటి వినియోగదారులు గౌరవం పొందినందుకు కంటెంట్ సృష్టి కర్తను అభినందించారు. ఇతన్ని భారత శ్రేయస్సు కొరకు, ప్రపంచ ప్రయోజనాల కోసం చురుకుగా నిమగ్నం చేయాలి ఝా అని తన ట్విట్ లో పేర్కొన్నారు. కిలీపాల్ ఇన్‌స్ట్రాగ్రామ్ ప్రొఫైల్ అతన్ని డాన్సర్ కంటెంట్ సృష్టికర్తగా అభివర్ణించింది. అతని వీడియోలన్ని యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నాయి. అతను ఇటీవల చేసిన పోస్టులలో ప్రజాదరణ పొందిన కచాబాదం సాంగ్ ఒకటి. ఈ పాటలో కిలిపాల్ సోదరీ నీలిమా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. వాస్తవానికి కచాబాదం పశ్చిమబెంగాల్‌కు చెందిన భుభన్ బద్యాకర్ పల్లీలు అమ్ముకుంటూ పాడిన పాట. ఇది సోషల్ మీడియాలో ఎలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read : Viral Video : సైకిల్ రైడర్లపై దారుణంగా దాడి చేసిన ఎద్దు..!