తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నువ్వెకావాలి సినిమా ఎంత సెన్సేషన్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా కొత్త హీరో అయినప్పటికీ టాలీవుడ్ యూత్ అందరినీ ఆకర్షించిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది.
Advertisement
దీంతో ఒక్క సినిమాతోనే హీరో తరుణ్ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడదలైన ఈ సినిమాను ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించారు. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోటి రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కి విడుదలైన తరువాత 20 కోట్ల వసూళ్లు రాబట్టింది.
Advertisement
ఈ చిత్రం ముఖ్యంగా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా వినూతనమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో తరుణ్ హీరోగా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత అద్బుతమైన విజయాన్ని సాధించిన నువ్వేకావాలి సినిమా ఏకంగా అప్పట్లో ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేసారట. కానీ ఆ తరువాత ఈ సినిమా సూపర్‌హిట్ అయిన తరువాత ఎందుకు రిజెక్ట్ చేసామని బాధపడ్డారట. నువ్వేకావాలి సినిమాలో రీఛా తరుణ్ సరసన హీరోయిన్‌గా నటించింది.
అయితే ముందుగా నువ్వేకావాలి సినిమా స్టోరీ దర్శకుడు విజయభాస్కర్ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు వినిపించారట. అప్పటికే పవన్‌కల్యాణ్ తొలిప్రేమ చేస్తూ బిజీగా ఉండడంతో పవన్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. ఇక తరువాత అక్కినేని వారసుడు సుమంత్ దగ్గరికీ ఈ కథ వెళ్లినట్టు తెలుస్తోంది. అప్పటికే సుమంత్ వరుసగా లవ్‌స్టోరీలలో నటిస్తున్నాడు. ఇది కూడా లవ్‌స్టోరీ కావడంతో ఈ సినిమాకు నో చెప్పేశాడట. వీరిద్దరి తరువాత సినిమా ట్రాక్‌లోకి తరుణ్ వచ్చాడట. ఇక తరుణ్ సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా హిట్ అయిన తరువాత మేము ఎందుకు రిజెక్ట్ చేశామా అని ఇద్దరు హీరోలు అనుకున్నారట.
Also Read: నాడు సెహ్వాగ్, ధోని-కోహ్లీలను ఔట్ చేసి ఫేమస్..నేడు పప్పులు అమ్ముతూ.. పాక్ బౌలర్..!