Home » సిరివెన్నెల‌కు నివాళ్ల‌ర్పిస్తూ కంట‌త‌డి పెట్టుకున్న టాలీవుడ్…!

సిరివెన్నెల‌కు నివాళ్ల‌ర్పిస్తూ కంట‌త‌డి పెట్టుకున్న టాలీవుడ్…!

by AJAY
Ad

టాలీవుడ్ లెజెండ్ లిరిక్ రైట‌ర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి నిన్న కిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన సంగ‌తి తెలింసిందే. కాగా సిరివెన్నెల గ‌త ఆరేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న‌ట్టు వైద్యులు వెల్ల‌డించారు. అంతే కాకుండా ఆయ‌న‌కు ఇప్ప‌టికే దానికి సంబంధించిన చికిత్స చేశామ‌ని కానీ మ‌ళ్లీ ఆరోగ్యం క్షీణించ‌డం వ‌ల్లే మ‌ర‌ణించార‌ని తెలిపారు. ఫిలింఛాంబర్ లో సిరివెన్నెల కు ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు.

నివాళ్లు అర్పించిన వారిలో హీరోలు బాలకృష్ణ, అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, నాని, రానా,ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్, న‌రేష్ స‌హా ప‌లువురు ఉన్నారు. ఈ సంధ‌ర్భంగా మెగాస్టార్ చరంజీవి మాట్లాడుతూ…..చిత్రపరిశ్రమకు సిరివెన్నెల తీరని లోటు..ఆయ‌న‌ లేని లోటును ఎవరూ కూడా భర్తీ చేయలేరని అన్నారు. సమాజాన్ని మేలుకొలిపే.. సమాజం ఆలోచింపజేసేలా ఆయన మాటలు పాటలు ఉండేవని మెగాస్టార్ వ్యాఖ్యానించారు.

Advertisement

mahesh babu

mahesh babu

కొద్ది రోజుల క్రితమే తన అనారోగ్య సమస్యలు తెలుసుకుని చెన్నై వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుందాం అని చెప్పిన‌ట్టు మెగాస్టార్ తెలిపారు. నేను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత చెన్నై వెళ్దామని సిరివెన్నెల కు చెప్పానని….ఇంతలోనే ఇలాంటి వార్త వింటామని ఊహించలేదని చిరంజీవి ఎమోష‌న‌ల్ అయ్యారు.

Advertisement

chiranjeevi

chiranjeevi

కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లే ముందే త‌న‌తో సిరివెన్నెల‌ ఫోన్ లో మాట్లాడారని చిరంజీవి వెల్ల‌డించారు. పుట్టిన వెంటనే ఎవరు కూడా మెగాస్టార్ కాలేరని చాలా సందర్భాల్లో త‌న‌తో అనేవారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

nani

nani

ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయ‌న అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. హిందూ సాంప్రదాయ పద్ధతి లో కుటుంబ స‌భ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

rana daggubati

rana daggubati

ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట‌కు సిరివెన్నెల అంత్యక్రియలు నిర్వ‌హించ‌నున్నారు. సినీ ప్ర‌ముఖులు అంత్య‌క్రియ‌లకు హాజ‌రు కానున్నారు.

Visitors Are Also Reading