జీవితం మీద విరక్తిపుట్టిన వాళ్లు మొదట కొట్టే డైలాగ్ సన్యాసుల్లో కలిసిపోతా….ఇక సన్యాసం అయితే ఎలాంటి ఆలోచనలు లేకుండా దైవ చింతనలో గడిపేయొచ్చు కాబట్టి అలా చెబుతుంటారు. ఇక మరికొందరు భక్తితో కూడా సన్యాసం పుచ్చుకుంటారు. అయితే ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ లు కూడా సన్యాసం పుచ్చుకున్నారని మీకు తెలుసా…? ఆ హీరోయిన్ లు ఎవరు ఎలాంటి సినిమాల్లో నటించారు అన్నది ఇప్పుడు చూద్దాం…
Advertisement
manisha koirala
మనీషా కొయిరాలా
ఈ బ్యూటీ టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అంతే కాకుండా బాలీవుడ్ మరియు ఇతర ఇండస్ట్రీలలోనూ సినిమాలు చేసింది. అయితే కెరీర్ పీక్స్ ఓ ఉన్న సమయంలోనే మనీషాకు అండాశయ క్యాన్సర్ వచ్చింది. అయితే చికిత్స తరవాత క్యాన్సర్ ను జయించింది. అనంతరం అధ్యాత్మకత వైపు అడుగులు వేసింది. 2016లో సన్యాసం పుచ్చుకుంది.
suchithra sen
సుచిత్రా సేన్
సుచిత్రా సేన్ 25ఏళ్ల పాటూ సినిమా పరిశ్రమలో ఓ వెలుగు వెలిగింది. ఆ తరవాత ఈమె కుటుంబంలో గొడవల కారణంగా అశాంతి నెలకొంది. ఆ తరవాత ఈమె రామకృష్ణమట్ లో చేరి సన్యాసం పుచ్చుకుంది.
Advertisement
barka madan
బర్కా మదన్
ఈ హీరోయిన్ పలు చిత్రాల్లో నటించింది. అయితే ముందు నుండి దలైలామా భోదనల పట్ల ఆకర్షితురాలు అయిన బర్కా మదన్ ఆ తరవాత 2012లో బుద్ధిజం పుచ్చుకుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ సన్యాసి జీవితాన్ని గడుపుతోంది.
sofiy hayat
Advertisement
సోఫియా హయత్
సోఫియా హయత్ హిందీ బిగ్ బాస్ 7లో అందర్నీ అలరించింది. బ్రిటిష్ సింగర్ మరియు మోడల్ గా కూడా సోఫియా రానించింది. కానీ ఈమె సన్యాసినిగా మారింది. అయితే మళ్లీ పెళ్లి చేసుకుని అందర్నీ షాక్ కు గురించేసింది.