సినిమాలోని కథ.. సూపర్ హిట్టా ? కాదా ? అసలు హీరో ఎవరు ? ఇలాంటి వాటికి ఏమి సంబంధం లేకుండా కూడా ప్రేక్షకులు సినిమాలకు వెళతారు. మరీ వాళ్లు.. ఎందుకు వెళ్తారో తెలుసా హీరోయిన్ డ్యాన్స్ కోసం… అవును, కొంతమంది హీరోయిన్స్ డ్యాన్స్ ప్రేక్షకులను కదిలించింది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చాలా మంది హీరోయిన్లు డ్యాన్స్ అద్భుతంగా చేస్తారు. కానీ అది ఎంతో కొంత మందిలో మాత్రమే ఆ డాన్స్ గ్రేస్ ఉంటుంది. ఆ డాన్స్ లతో సినిమా హిట్ అవుతుంది. అయితే, తమ డ్యాన్స్‌తో ఇండియన్ స్క్రీన్‌ని షేక్ చేసిన 10 మంది హీరోయిన్స్ గురించి ఇవాళ తెలుసుకుందాం.
Advertisement
# శ్రీ లీల:
శ్రీ లీల… అందం మాత్రమే కాదు అద్భుతంగా డాన్స్ చేయగలదు. ఈమె డ్యాన్స్ లో మంచి గ్రేస్ కూడా ఉంటుంది. ధమాకా హిట్ కావడానికి శ్రీ లీల ఎంతో కష్టపడింది.
# మాధురి దీక్షిత్:
తన అందంతో పాటు డ్యాన్స్ తో కూడా మంత్రముగ్ధుల్ని చేసేది ఈ బాలీవుడ్ హీరోయిన్. ఈమెను లిస్టులో నెంబర్ 1 అనుకోవచ్చు.
# ఊర్మిళ:
‘రంగీలా’ బ్యూటీ డ్యాన్సుతో అందరిని మత్తెక్కించగలదు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది అంటే ఈమె డాన్స్ ప్రధాన కారణమని చెప్పొచ్చు.
# ఐశ్వర్యరాయ్:
సాధారణంగా ఐశ్వర్యం అంటే డబ్బు అనాలి. కానీ దానికి డెఫినేషన్ అందమని మార్చేసింది ఈ బ్యూటీ. అందం మాత్రమే కాదు డాన్స్ తో కూడా ఈమె టాప్ లేపేసేది.
Advertisement
# రాధా:
అప్పట్లో మన మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఈమె చేసే డ్యాన్స్ కు థియేటర్స్ లో జనాలు, ఈలలు, కేకలతో ధూమ్ ధామ్ చేసేవారు. అంత బాగా డాన్స్ చేసేది.
# శ్రీదేవి:
మన అతిలోక సుందరి శ్రీదేవి కూడా తన డ్యాన్స్ తో ఇండియన్ సినిమాని ఓ ఊపేసింది.
# సమీరా రెడ్డి:
ఎంత ఫెడౌట్ అయిపోయినా సరే, ఈమె డాన్స్ మాత్రం ఇరాక్కోట్టేసేదండి.
# తమన్న:
మిల్కీ బ్యూటీ కూడా డాన్స్ సూపర్ గా చేస్తుంది. ఈమె అందానికి డాన్స్ తోడైతే ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూసాం.
# శృతిహాసన్:
హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈమె డాన్స్ చేయగలదు. ఈమె కూడా బెస్ట్ డాన్సర్ అని చెప్పొచ్చు.
# సాయి పల్లవి:
మన ఫిదా బ్యూటీ డ్యాన్స్ గురించి చెప్పేదేముంది. ఈమె డాన్స్ చేసే సాంగ్స్ అన్ని యూట్యూబ్‌ల్లో బిలియన్ వ్యూస్ ను కొల్లగొడుతుంటే, హీరోలు కూడా ఈమెతో పోటీపడి డ్యాన్స్ చేయలేకపోతున్నారు.
READ ALSO : విడాకుల తర్వాత సమంతకు మిగిలిన ఆస్తుల వివరాలు… ఆమె దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే!