Telugu News » Blog » 50ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని టాప్ హీరోయిన్లు వీరే..!

50ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని టాప్ హీరోయిన్లు వీరే..!

by AJAY
Ads

సినీప‌రిశ్ర‌మ‌లో పెళ్లిళ్లు బ్రేక‌ప్ లు కామ‌న్…ఇక మ‌రికొంత‌మంది అయితే ఏళ్ల‌త‌ర‌బ‌డి డేటింగ్ చేస్తారు కానీ పెళ్లిళ్లు మాత్రం చేసుకోరు. మ‌రి కొంత‌మంది ఎంత వ‌య‌సు వ‌చ్చినా పెళ్లి జోలికి వెళ్ల‌కుండా సింగిల్ గా గ‌డిపేస్తుంటారు. అలా ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోయిన్లు యూబై దాటినా సింగిల్ గానే బ్ర‌తుకున్నారు. వారు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

Advertisement

actress tabu

actress tabu

పెళ్లి చేసుకోని హీరోయ‌న్ల‌లో మొద‌టగా గుర్తుకు వ‌చ్చే పేరు ట‌బు. టాలీవుడ్ లో ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల‌లో ట‌బు హీరోయిన్ గా న‌టించింది. ఇప్ప‌టికీ బాలీవుడ్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కొన‌సాగుతోంది. ట‌బు వ‌య‌సు యాబై దాటిపోయింది. కానీ ఇప్ప‌టికీ పెళ్లికి దూరంగానే ఉంది.

susmita sen

susmita sen

హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సుస్మితా సేన్ కూడా పెళ్లికి దూరంగానే ఉంది. సుస్మితా వ‌య‌సు కూడా యాబై దాటింది. పెళ్లికి దూరంగా ఉంది కానీ సుస్మీతా ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకుని వారి బాగోగులు చూసుకుంటోంది.

Advertisement

shobana

shobana

పెళ్లికి దూరంగా ఉన్న మ‌రో హీరోయిన్ శోభ‌న. త‌న డ్యాన్స్ తో శోభ‌న ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకుంది. శోభ‌న 50 ఏళ్లు దాటి 51 ఏళ్ల వ‌య‌సులోకి అడుగుపెట్టింది. కానీ పెళ్లికి మాత్రం శోభ‌న దూరంగా ఉంది.

divya dattha

divya dattha

బాలీవుడ్ హీరోయిన్ దివ్యాద‌త్తా కూడా పెళ్లికి దూరంగానే ఉంది. త‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కూ స‌రైన జోడీ దొర‌క‌లేద‌ని అందుకే పెళ్లి దూరంగా ఉన్నాన‌ని చెబుతుంది దివ్యాద‌త్తా.

ameesha patel

ameesha patel

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగిన అమీషా ప‌టేల్ కూడా పెళ్ళికి దూరంగానే ఉంది. తెలుగులో ప‌లు చిత్రాల్లో న‌టించి అమీషా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. 46 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ పెళ్లికి దూరంగానే ఉంది. ఇక వీరితో పాటూ సితారా, న‌గ్మా కూడా పెళ్లికి దూరంగా ఉన్నారు.