చాలామంది టాలీవుడ్ హీరోయిన్ లు పెళ్లి చేసుకుని సంసార సాగరాన్ని ఈదుతున్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకుంటే మరి కొంతమంది మాత్రం వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్నారు. అలా వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Advertisement
Also Read: టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ కలిగిన హీరో ఎవరు ? టాప్ లో ఉన్నది ఏ హీరో అంటే ?
టాలీవుడ్ అందాల తార శ్రీయ శరణ్ 2018లో ఆండ్రి కోష్చీవ్ ను పెళ్లి చేసుకుంది. ఆండ్రి ఒకప్పుడు షట్లర్ కాగా ప్రస్తుతం వ్యాపారాలు చేస్తున్నాడు.
బ్యూటీ ప్రియమణి సైతం వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ప్రియమణి అప్పటికే పెళ్లై విడాకులు తీసుకున్న ముస్తఫా ను 2017 ఆగస్టులో పెళ్లి చేసుకుంది.
హీరోయిన్ పూర్ణ షానిద్ ఆసిఫ్ ను పెళ్లి చేసుకుంది. పూర్ణ భర్త కూడా ప్రముఖ వ్యాపారవేత్త కాగా వీరిద్దరూ అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా పూర్ణ సినిమాలలో నటిస్తోంది.
Advertisement
హీరోయిన్ కాజల్ అగర్వాల్ భర్త సైతం వ్యాపారవేత్త అన్న విషయం చాలామందికి తెలియదు. కాజల్ భర్త గౌతమ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఇక కాజల్ కిచ్లు అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నారు.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రీతిజింతా సైతం వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ప్రీతిజింతా భర్త జెనే గుడెన్ వ్యాపారి గా ఎంతో గుర్తింపు సాధించుకున్నాడు. హీరోయిన్ హాసిని 2017 సంవత్సరంలో వ్యాపారవేత్త రాహుల్ శర్మని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆసిన్ సినిమాలకు దూరమైంది.
స్టార్ హీరోయిన్ హన్సిక తన చిన్ననాటి ప్రియుడిని పెళ్లి చేసుకోబోతుంది. హన్సిక తన ప్రియుడు సోహెల్ ను డిసెంబర్ 4న పెళ్లి చేసుకోబోతోంది. హన్సిక సోహెల్ కలిసి ఓ ఈవెంట్ మేనేజింగ్ కంపెనీని రన్ చేస్తు్నారు.