సినిమాల్లో హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో దర్శకులకు కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఎన్నో తెలివితేటలు ఉంటే గానీ సినిమాలు తీసి దర్శకులు అవ్వలేరు. ఇక అంతటి టాలెంట్ ఉన్న డైరెక్టర్లను ఎవరు మాత్రం ఇష్టపడరు. కాబట్టి కొంతమంది హీరోయిన్లు దర్శకులనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు…ఇప్పటికీ చేసుకుంటున్నారు కూడా. అలా దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం…
Advertisement
Ramya Krishnan Krishna Vamshi
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రమ్యక్రిష్ణ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చంద్రలేఖ సినిమాకు కృష్ణ వంశీనే దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రమ్యకృష్ణ కృష్ణవంశీ ల మధ్య ప్రేమ చిగురించిందట. ఆ తరవాత 2003లో వీరిద్దరూ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.
Ad
Suhasini manirathnam
సీనియర్ హీరోయిన్ సుహాసిని కూడా ప్రముఖ దర్శకులు మణిరత్నంతో ప్రేమలో పడింది. ఆ తరవాత ఈ జంట పెళ్లిచేసుకుని ఒక్కటయ్యింది. 1988లో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కింది.
Advertisement
Roja Rk selvamani
హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చకుని ప్రస్తుతం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రోజా సెల్వమణి కూడా దర్శకుడినే వివాహం చేసుకుంది. తమిళ దర్శకుడు ఆర్కె సెల్వమణి తెరకెక్కించిన సినిమాల ద్వారా రోజాకు తమిళంలోనూ క్రేజ్ వచ్చిందట. ఇక రోజా అలా వరుస సినిమాలు చేసిన వీరి మధ్య ప్రేమ చిగురించింది. దాంతో 2002లో ఈ జంట పెళ్లి చేసుకుని ఒక్కటయ్యింది.
Amala paul vijay
బోల్డ్ బ్యూటీ అమలాపాల్ కూడా తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ ను వివాహం చేసుకుంది. కానీ వీరి వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. పెళ్లితరవాత అమల సినిమాలు చేయడం భర్తకు నచ్చలేదంట. దాంతో ఈ జంట విడాకులు తీసుకుంది.
Nayanatara Vignesh shivan
ఇదిలా ఉంటే స్టార్ హీరోయిన్ నయనతార కూడా ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. త్వరలో తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈ జంట స్పష్టం చేసింది.