Home » Tapsee : ఆ పెళ్లైన హీరోతో రిలేషన్ లో హీరోయిన్ తాప్సి ?

Tapsee : ఆ పెళ్లైన హీరోతో రిలేషన్ లో హీరోయిన్ తాప్సి ?

by Bunty
Ad

తాప్సి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ వైపుకు వెళ్ళింది. అక్కడ వరుసగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం తాప్సి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో బాలీవుడ్ ను ఏలుతోంది.

Advertisement

ఈ క్రమంలోనే లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కెరఫ్ అడ్రస్ గా మారి స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీని ఇచ్చింది. ఇక కొన్ని రోజులకి తాను నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఈ అమ్మడికి ఆఫర్స్ కూడా తగ్గుముఖం పట్టాయి. ఇక కొన్ని సినిమాలు అయితే జనాలు లేక షోస్ ని కూడా మూసేశారు. ఇక తాజాగా తాప్సి ఓ మంచి సినిమాలో అవకాశం దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంతో అందంగా ఉన్నప్పుడు తనకు రాని సినిమా అవకాశాలు ఇప్పుడు వస్తున్నాయట.

Advertisement

ఈ అమ్మడు ఏకంగా షారుఖ్ ఖాన్ తో జతకట్టే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ‘డంకీ’ సినిమా రాబోతోంది. ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ అవుతుంది. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన 10 సంవత్సరాలకి అరుదైన అవకాశాన్ని అందుకుంది. వరుసగా రెండు వెయ్యికోట్ల బడ్జెట్ తో రెండు సినిమాల్లో నటించే అవకాశాన్ని పొందింది. ఈ రెండు సినిమాల్లో షారుక్ ఖాన్ తో నటించే అవకాశాన్ని అందుకుంది. లేటు వయసులో మంచి అవకాశాన్ని తాప్సి అందుకుందంటూ అభిమానులు సంతోషపడుతున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading