Home » టాలీవుడ్ నటి లైలా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఆమె భర్త ఎవరంటే ?

టాలీవుడ్ నటి లైలా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఆమె భర్త ఎవరంటే ?

by Bunty
Ad

“ఎగిరేపావురం” చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు అడుగుపెట్టిన సొట్ట బుగ్గల సుందరి లైలా గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎన్నో చిత్రాల్లో నటించి అప్పటి యువతను ఉర్రుతలూగించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో కలిపి సుమారు 46 పైగా చిత్రాల్లో నటించింది. ఈమె తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. తన చిలిపితనం, అల్లరితనంతో చిన్నపిల్లలాగా ఉండే ఈవిడ మనస్తత్వానికి ఎంతోమంది అభిమానులు ఫిదా అయ్యేవారు.

Advertisement

ఈవిడ నటించిన ఎగిరే పావురం సినిమా ఎంతో విజయాన్ని సొంతం చేసుకుంది. తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నటువంటి లైలా వరుస సినిమా అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. “ఉగాది” సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా వెంకటేష్, సౌందర్య జంటగా నటించిన “పెళ్లి చేసుకుందాం రా” సినిమాలో వెంకటేష్ కి మరదలు పాత్రలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఇక ఆ సినిమా అనంతరం ఖైదీగారు, పవిత్ర ప్రేమ, శుభలేఖ, లవ్ స్టోరీ 1999 వంటి సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీని వీడి తమిళ ఇండస్ట్రీవైపుకు వెళ్ళింది.

Advertisement

తమిళంలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. తమిళంలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఈ అమ్మడు తెలుగులో నటించిన ఆఖరి చిత్రం “మిస్టర్ అండ్ మిసెస్ శైలజ కృష్ణమూర్తి”. ఇక ఈ సినిమా అనంతరం లైలా 2006 సంవత్సరంలో ఇరాన్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను లైలా వివాహం చేసుకుంది. వివాహ అనంతరం లైలా సినిమాలకు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం లైలా ఇద్దరు పిల్లలతో తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. ఇక ఈ అమ్మడు సినిమాలకు మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. వెండితెరపై జబర్దస్త్ వంటి షోలలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు లైలా.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading