ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ లుగా రాణించిన ముద్దుగుమ్మల్లో హీరోయిన్ కుష్బు కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో కుష్బూ ప్రేక్షకుల మనసుదోచుకుంది. స్టార్ హీరోలు అందరి సరసన జోడీ కట్టింది. తమిళ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులోనూ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇక ఏజ్ బార్ అయిన తరవాత చాలా మంది హీరోయిన్ ల మాదిరిగానే కుష్బు తల్లి అత్త పాత్రలతో పాటూ సినిమాల్లో పాత్రకు ప్రాధన్యత ఉంటే నటిస్తోంది.
ఇవి కూడా చదవండి: ఎన్టీఆర్ ఆ ఛాన్స్ ఇవ్వకుంటే హీరోయిన్ వాణిశ్రీ ఏమైపోయేదో తెలుసా..?
Advertisement
అంతే కాకుండా టీవీ షోలలో కూడా సందడి చేస్తోంది. ఇక ఇటీవల రోజా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పడంతో ఆ స్థానంలో జడ్జిగా కుష్బు ఎంట్రీ ఇచ్చింది. జడ్జిగానూ తనదైన ముద్రను వేసుకుంటోంది. ఇక కుష్భు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే దర్శకుడు మరియు నటుడు సి సుంధర్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సి సుంధర్ మొదటి సినిమా మురై మామన్ లో కుష్భూ హీరోయిన్ గా నటించింది.
Advertisement
ఇవి కూడా చదవండి: ‘క్యాష్’ ప్రోగ్రామ్‌కి సుమ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా..?
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సి సుంధర్ కుష్బూ అందానికి ఫిదా అయ్యాడు. కాగా తాజాగా కుష్భు తన లవ్ స్టోరీని జబర్దస్త్ స్టేజిపై బయటపెట్టారు. సుందర్ మొదటి సినిమా సమయంలోనే ప్రేమలో పడగా ఆ తరవాత పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. పెళ్లి చేసకుని 28 ఏళ్లు అవుతున్నా తన భర్త ఇప్పటికీ ఐలవ్యూ చెప్పలేదని అన్నరు.
తన భర్తకు తాను ఒక్కసారి కూడా ఐలవ్యూ చెప్పలేదని అన్నారు. అంతే కాకుండా తన భర్త ఫోన్ నంబర్ ను తన ఫోన్ లో స్వీట్ హార్ట్ అని సేవ్ చేసుకున్నట్టు చూపించారు. ఇక ప్రస్తుతం జబర్దస్త్ లో కష్భూ చెప్పిన మాటల ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి: “నువ్వునాకు నచ్చావ్” పింకీ జీవితంలో ఇంత విషాదం ఉందా..? అది తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!