సినీ పరిశ్రమలో మరో ప్రేమ జంట పెళ్లి పీటలెక్కనున్నారు. కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు మూడు ముళ్ళు బంధంతో ఒకటి కాబోతున్నట్లుగా సమాచారం. వచ్చే నెలలో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. వీరి పెళ్లికి సినీ ప్రముఖులు మాత్రమే హాజరుకానున్నారని. ఇక ముంబైలో జరిగే రిసెప్షన్ కు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరి వివాహం చండీగఢ్ లోని ది ఒబెరాయ్ సుఖ్విలాస్ స్పా అండ్ రిసార్ట్స్ లో జరగనుందని టాక్ నడుస్తోంది.
Advertisement
Advertisement
ముందుగా వీరిద్దరూ తమ వివాహాన్ని గోవాలో సిద్ధార్థ కుటుంబ సభ్యుల సమక్షంలో పంజాబీ సంప్రదాయంలో నిర్వహించాలని భావించారని అనివార్య కారణాలతో చండీగఢ్ కు మార్చినట్లుగా సమాచారం. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సిద్ధార్థ్ కీయారాతో ప్రేమ పెళ్లి గురించి పరోక్షంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా స్టార్ హీరో షాహిద్ కపూర్ కియారాతో కలిసి కాఫీ విత్ కరణ్ షోకి విచ్చేసినప్పుడు కియారా వివాహం డిసెంబర్ లో జరగనున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.
Also Read : రాజబాబు నుంచి సుకుమార్ వరకు ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీరే..!
ప్రస్తుతం కియారా అద్వానీ డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న ఆర్సీ 15 చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పొలిటికల్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్ అంజలి కీలక పాత్రలో నటిస్తోంది.