Home » కాంతార సినిమా కంటే ముందే తెలుగు సినిమాలో నటించిన రిషబ్ శెట్టి.. అది ఏ సినిమాలో తెలుసా ?

కాంతార సినిమా కంటే ముందే తెలుగు సినిమాలో నటించిన రిషబ్ శెట్టి.. అది ఏ సినిమాలో తెలుసా ?

by Anji
Ad

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతార అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం రెండు కోట్ల రూపాయలతో ఈ సినిమా తెలుగు హక్కులను గీతా ఆర్ట్స్ సంస్థ కొనుగోలు చేయగా.. దానికి 10 రెట్లు లాభాలు తెచ్చి పెట్టింది. ఇప్పటికే ఈ సినిమా విడుదలై  18 రోజులు గడవగా 18వ రోజు కూడా రూ.81 లక్షలు కలెక్ట్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 22 కోట్ల 68 లక్షలు షేర్, 41 కోట్ల 15 లక్షలు గ్రాస్ సాధించింది.

Advertisement

మొత్తం మీద తెలుగులో ఈ సినిమా 20 కోట్ల 38 లక్షల లాభాలు తెచ్చి పెట్టిన సినిమా కొనుక్కున్న గీతా ఆర్ట్స్ సంస్థకు భారీగానే లాభాలు తెచ్చి పెట్టింది. అయితే రిషబ్ శెట్టి గతంలో కిరాక్ పార్టీ వంటి సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. అయితే నిజానికి ఆయన ఒక తెలుగు సినిమాలో కూడా నటించాడు. అది కూడా ఈ ఏడాది విడుదలైన సినిమాల్లోనే. ఆ సినిమా మరేంటో కాదు మిషన్ ఇంపాజిబుల్.

Also Read :  పాపం: ఈ అందాల ముద్దుగుమ్మలకు ఇన్ని వ్యాధులు ఉన్నాయా..?

Advertisement

ముగ్గురు బాలల ప్రధాన పాత్రల్లో తాప్సీ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్జే దర్శకత్వం వహించారు. మాట్ని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ భారీ అంచనాలతో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ రిషబ్ శెట్టి ఈ సినిమాలో రెండు నిమిషాల ఒక చిన్న పాత్రలో కనిపించాడు. మిషన్ ఇంపాజిబుల్ కథ ప్రకారం ముగ్గురు బాలలు ముంబై వెళ్తున్నాము అనుకుని బెంగళూరు వెళ్తారు.  చిన్న దొంగ పాత్రలో రిషబ్ శెట్టి కనిపించారు. మీరు అప్జర్వ్ చేసినట్టయితే ఖలీల్ అనే పాత్రలో రిషబ్ శెట్టి కనిపిస్తాడు. స్వరూప్ తీసిన మొదటి సినిమా సాయి ఎనివాస్ ఆత్రేయ బాగా నచ్చడంతో తనను కలిసినప్పుడు రిషబ్ శెట్టి ఆయనను అభినందించాడు. వారిద్దరి మధ్య పరిచయం ప్రారంభమై స్నేహానికి దారి తీసింది.  మీ కోసం ఒక పాత్ర అనుకున్నాను మీరే చేయాలని అడిగితే ఎలాంటి డబ్బు తీసుకోకుండా స్వరూప్ స్నేహం కోసమే  రిషబ్ శెట్టి ఆ సినిమా చేశాడట.

Also Read :  రాజబాబు నుంచి సుకుమార్ వరకు ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీరే..!

Visitors Are Also Reading