Home » Heroine Gopika: నా ఆటో గ్రాఫ్ హీరోయిన్ గోపిక ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా ? ఎంతలా మారిపోయిందంటే ?

Heroine Gopika: నా ఆటో గ్రాఫ్ హీరోయిన్ గోపిక ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా ? ఎంతలా మారిపోయిందంటే ?

by Sravya

ఇండస్ట్రీ లోకి చాలామంది వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు చాలామంది పెద్దపెద్ద నటులు అవ్వాలని ఇండస్ట్రీలోకి వస్తుంటారు. కానీ వరుసగా కొన్ని సినిమాలు చేశాక మళ్ళీ అవకాశాలు రాక ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. నటి గోపిక గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. రవితేజ హీరోగా వచ్చిన నా ఆటోగ్రాఫ్ సినిమాలో కీలక పాత్ర పోషించారు. తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో ఆమె నటించింది. గోపిక అసలు పేరు గర్లీ ఆంటో.

గోపిక ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించింది. మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి మళయాళ సినిమాల్లో నటించింది. తర్వాత తమిళ, తెలుగు సినిమాలు కన్నడ సినిమాలు కూడా చేసింది. సౌత్ సినిమాల్లో మంచి నటనతో పాటుగా తన అందంతో అందరిని ఆకట్టుకుంది. 2008లో డాక్టర్ అజిలేష్ ని పెళ్లి చేసుకుంది వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈమె కుటుంబంతో గడుపుతోంది. తాజాగా ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆమె ఫ్యామిలీ ఫొటోస్ ని చూసి తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. తన భర్త ఐర్లాండ్ లో పని చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన పిల్లలతో భర్తతో ఆస్ట్రేలియాలోని స్థిర పడ్డారు. ఈమె సిరో మలబార్ కాథలిక్ కుటుంబం లో ఆంటో ఫ్రాన్సిస్, టెస్సీ ఆంటోలకు పుట్టారు. ఒల్లూరులోని సెయింట్ రాఫెల్స్ కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్‌లో ఈమె 12వ తరగతి దాకా చదివి, కాలికట్ యూనివర్సిటీలో సోషియాలజీలో డిగ్రీ చేసారు. జయసూర్య, వినీత్‌లతో కలిసి తులసి దాస్ దర్శకత్వంలో ప్రణయమణిథూవల్ లో నటించారు.అదే మొదటి చిత్రం. అంతగా ఆడలేదు కానీ బానే గుర్తింపు వచ్చింది.  మరి గోపిక ఫ్యామిలీ ఫొటోస్ ని మీరు కూడా చూసేయండి.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading