Home » నాగార్జున గీతాంజలి మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?

నాగార్జున గీతాంజలి మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?

by Bunty
Ad

నాగార్జున కెరీర్ లోనే సూపర్ హిట్ చిత్రాల్లో గీతాంజలి ఒకటి. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాగార్జున, గిరిజ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సంచలన విజయం సృష్టించింది. ఈ సినిమాలో గిరిజ నటనకు ప్రేక్షకులు అందరూ ఫిదా అయ్యారు. ఈ అమ్మడు పుట్టి పెరిగింది ఇంగ్లాండ్ లో. గిరిజాకు చిన్ననాటి నుంచి భరతనాట్యం అంటే ఎంతో ఆసక్తి ఉండేదట.

Heroine Girija Has Changed

కానీ చదువు మధ్యలో ఆపేయడం ఎందుకని చదువు పూర్తయ్యాక భరతనాట్యం నేర్చుకోవడానికి ఇండియాకు వచ్చిందట. అక్కడే అనుకోకుండా సుహాసిని మణిరత్నం గారు పరిచయమయ్యారట. ఇక మణిరత్నం గిరిజను చూసిన వెంటనే సినిమాల్లో నటిస్తావా అని అడిగారట. ఇక గిరిజకి కూడా సినిమాలు, డ్యాన్స్ అంటే ఆసక్తి ఉండడంతో వెంటనే ఓకే చెప్పిందట. అలా గిరిజ మొదట గీతాంజలి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఆ తర్వాత రెండు, మూడు చిత్రాల్లో నటించింది.

Advertisement

Advertisement

ఆ సినిమాలు సక్సెస్ అయినప్పటికీ గిరిజాకు పెద్దగా గుర్తింపు రాలేదు. స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. గిరిజ తెలుగులోనే కాకుండా మలయాళ సినిమాల్లో కూడా మంచి అవకాశాలను అందుకుంది. గిరిజ తండ్రి డాక్టర్ కాగా, తల్లి ప్రముఖ వ్యాపారవేత్త. సినిమాల్లో రాణించలేనని అనుకున్న గిరిజ తిరిగి ఇంగ్లాండ్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం గిరిజ ఇంగ్లాండ్ లో జర్నలిస్టుగా పనిచేస్తుంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading