హీరోయిన్ జెనీలియా అనగానే చాలామందికి ముందుగా గుర్తుకువచ్చే క్యారెక్టర్ హాసిని. సిద్ధార్థ్ హీరోగా వచ్చిన బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు సాధించింది జెనిలియా. బాయ్స్ అనే మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన జెనీలియా ఆ తర్వాత నా ఇష్టం, బొమ్మరిల్లు, ఢీ శశిరేఖ, పరిణయం, నా అల్లుడు, హ్యాపీ, సాంబ, ఆరెంజ్ వంటి హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు సాధించింది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా చేసి మంచి పేరు తెచ్చుకుంది.
Advertisement
Also Read:రెండో పెళ్లి గురించి మనోజ్ ఏమన్నాడో తెలుసా ?
Advertisement
అలాంటి ఈ అమ్మడును ఓ స్టార్ హీరో కొడుకు చనువుగా ఉండి వాడుకోవాలని చూశారట.మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ స్టార్ హీరో కొడుకు కి అప్పటికి ఒక్క హిట్ కూడా పడలేదు. కానీ ఆ హీరో తో జెనీలియా చేసే టైంలో కాస్త డిప్రెషన్ లో ఉందట. దీంతో ఆ వ్యక్తి దొరికింది చాన్స్ అనుకోని జెనీలియాని వాడుకొని వదిలేద్దామని అనుకున్నారట. ఆ ఆలోచనతోనే ఆమె దగ్గరికి వచ్చి మాయ చేసే ప్రయత్నం చేశారట. ఇది గమనించిన జెనీలియా ఆ స్టార్ హీరో కొడుక్కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయిందట.
ఇక ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులతో కూడా చెప్పి బాధపడిందట. దీంతో వారి తల్లిదండ్రులు ఇండస్ట్రీలో ఇలాంటి వారు కూడా ఉంటారు జాగ్రత్త అమ్మ అని చెప్పారట . ప్రస్తుతం జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తలైంది. ఏదైనా మంచి పాత్ర వస్తే మళ్ళీ సినిమాలో రియంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది.
Also Read:ఇకపై నన్ను ఏదీ బాధించలేదు… సమంత ఎమోషనల్ పోస్ట్