తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా చేయనటువంటి పనులను చిన్న వయసులోనే చేసిన ఏకైక హీరోయిన్ దివ్యభారతి. 16 ఏళ్ల వయసుకే ఆమె స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ టైంలోనే ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు వెయిట్ చేసేవారట. ఎంత త్వరగా ఇండస్ట్రీలో స్టార్ డం తెచ్చుకుందో అంతే త్వరగా ఇండస్ట్రీ కి దూరమైంది దివ్యభారతి. చిన్నతనంలోనే అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్యభారతి వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలి రాజా మూవీ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
Advertisement
Also Read:హీరోయిన్ రాశిని అలా చేసి మోసం చేసిన స్టార్ డైరెక్టర్..!!
Advertisement
ఈ మూవీ తర్వాత ఆమెకు తెలుగు లో అనేక ఆఫర్లు వచ్చాయి. పదహారేళ్లకే స్టార్ హీరోయిన్ హోదా ఆ తర్వాత 18 ఏళ్లలోపే ప్రియుడుతో పెళ్లి,ఊహించని రీతిలో మరణం ఇలా అన్నీ ఒకేసారి జరుగుతూ వచ్చాయి. ఇప్పటికీ హీరోయిన్ దివ్యభారతి మరణం ఇండస్ట్రీలో మిస్టరీ గానే మారింది. చిన్న వయసులోనే లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న దివ్య భారతి 1974 ఫిబ్రవరి 24వ తేదీన జన్మించింది. ముందుగా హీరోయిన్ కావాలని అనుకోలేదట. అనుకోకుండా పదహారేళ్లకే ప్రముఖ నిర్మాత రామానాయుడు నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ లో నిర్మించిన బొబ్బిలి రాజా చిత్రంతో హీరోయిన్ గా అడుగు పెట్టింది.
1992లో విశ్వాత్మ అనే మూవీ ద్వారా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అలా తెలుగు,హిందీ, తమిళ భాషలలో 14 చిత్రాల్లో నటించింది. తెలిసి తెలియని వయసులో ప్రేమకు ఆకర్షితురాలై తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకుంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిత్ నదియాడ్ తో కొన్నాళ్లు ప్రేమలో ఉండి 1992 మే 10న రహస్యంగా వివాహం చేసుకుంది. పెళ్లయిన కొన్ని నెలలకు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అనుమానస్పద పరిస్థితిలో తనువు చాలించింది.
Also Read:హీరోయిన్ జెనీలియాని ఆ స్టార్ హీరో కొడుకు మోసం చేశాడా..?