Home » Simran: ఒకప్పటి హీరోయిన్ సిమ్రాన్ ఇంతమంది హీరోలతో లవ్ ఫెయిల్యూర్ అయ్యిందా ?

Simran: ఒకప్పటి హీరోయిన్ సిమ్రాన్ ఇంతమంది హీరోలతో లవ్ ఫెయిల్యూర్ అయ్యిందా ?

by Sravya
Ad

Simran : స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. నటి సిమ్రాన్ హీరోయిన్ గా కొనసాగిస్తున్న టైం లో ఆమె లవ్ అఫైర్లు కి సంబంధించి రూమర్స్ చాలా వచ్చాయి. ఆమెని ఎంతమంది హీరోలు ప్రేమించారో తెలుసా..? సిమ్రాన్ చాలా సినిమాల్లో నటించింది చాలామంది హీరోలు పక్కన కలిసి పని చేసింది. తెలుగులో కంటే ఆమె తమిళంలో ఎక్కువ సినిమాలు చేసి అందర్నీ ఆకట్టుకుంది.

simra-pics

Advertisement

టాప్ స్టార్స్ తో సినిమాలు చేసి అందరినీ మెప్పించింది. కన్నడ, మలయాళం లో కూడా అందర్నీ ఆమె తన నటనతో మెప్పించింది. ఇది ఇలా ఉంటే సిమ్రాన్ సక్సెస్ రేట్ తో పాటుగా లవ్ ఎఫైర్ వార్తలు కూడా అప్పట్లో గట్టిగానే వచ్చాయి. చాలా మంది హీరోలతో డేటింగ్ చేసిందని ఈ ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు ఎక్కువగానే వచ్చాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో ఆమె ఎఫైర్ రూమర్స్ రావడం జరిగింది.

Also read: కమెడియన్ అనే చిన్న చూపు..? త్రిష, అనుష్క ఆనాడు ఏం చేసారంటే..

అబ్బాస్:

హీరోయిన్ సిమ్రాన్ అబ్బాస్ తో ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. సిమ్రాన్ తమిళంలో నటించిన మొదటి సినిమా వీఐపీ. ఇందులో ప్రభుదేవా అబ్బాస్ హీరోలుగా నటించారు. అబ్బాస్ కి జోడిగా సిమ్రాన్ నటించింది. ఈ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది ఇద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. కానీ సన్నిహితుల సలహా మేరకు ఆయన సిమ్రాన్ కి బ్రేకప్ చెప్పారట.

Advertisement

Also read: బాల‌య్య స‌ర‌స‌న క‌నిపిస్తున్న ఈ ఇద్ద‌రూ చిన్నారులు ఇప్పుడు కూడా టాలీవుడ్ స్టార్స్ అనే విష‌యం మీకు తెలుసా..?

డాన్స్ మాస్టర్ రాజు సుందరం:

 సిమ్రాన్ డాన్స్ మాస్టర్ రాజు సుందరం తో ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి ప్రభుదేవా సోదరుడైన డాన్స్ మాస్టర్ రాజు సుందరం, సిమ్రాన్ మధ్య ప్రేమ నడిచిందట పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట కానీ కారణాలు ఏంటో తెలియదు కానీ ఇద్దరు విడిపోయారు.

Also read: ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు లెజెండ్స్ యొక్క వైఫ్స్!

కమల్ హాసన్:

కమల్ హాసన్ తో సిమ్రాన్ ఎఫైర్ పెట్టుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కమల్ హాసన్ సిమ్రాన్ పంచతంత్రం సినిమాలో నటించారు. ఆ కెమిస్ట్రీతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ వచ్చాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ సిమ్రాన్ 2003లో చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కొడుకులు. పెళ్లి తర్వాత సిమ్రాన్ సినిమాలు తగ్గించేసింది సినిమా ఇండస్ట్రీకి కొన్నాళ్ళు తర్వాత గుడ్ బాయ్ చెప్పేసింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading