Home » లేడీ గెటప్స్ లో కూడా అద్భుతంగా నటించిన హీరోలు..ఎవరంటే..?

లేడీ గెటప్స్ లో కూడా అద్భుతంగా నటించిన హీరోలు..ఎవరంటే..?

Ad

సినిమా ఇండస్ట్రీ అంటేనే నటన. కొంతమంది నేను ఒకే విధమైన క్యారెక్టర్లు చేయాలని ఇండస్ట్రీలోకి వస్తారు. కానీ అలా చేయడం కుదరదు. సమయం వస్తే ఎలాంటి క్యారెక్టర్ చేయడానికయినా సిద్ధపడి ఉండాలి. అలాంటప్పుడు మీకు మీలో ఉన్న నటుడికి గుర్తింపు ఉంటుంది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు సైతం సమయానికి తగ్గట్టుగా పాత్రలతో ఎలాంటి గెటప్ లైన వేయడానికి సిద్ధమై ఉన్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆడ గెటప్ వేసి మెప్పించిన స్టార్ హీరోలు ఎవరో చూద్దామా..

also read:ఎన్టీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు టిఫన్ ధరలు నిర్ణయించారని తెలుసా ? ఇడ్లి, దోశ ఎంతంటే? ?

Advertisement

ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు సైతం ఎన్నో సార్లు ఆడపిల్లల పాత్రలు వేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇందులో కమలహాసన్ భామనే సత్యభామనే సినిమా కోసం రాజేంద్రప్రసాద్ మేడం సినిమా కోసం ఆడపిల్లల గెటప్ వేశారు. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో ఆడవేషం వేయక తప్పలేదు. ఇక లేడీ గెటప్ విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కమలహాసన్ తెలుగు మరియు తమిళంలో 27 ఏళ్ల క్రితం నటించిన భామనే సత్యభామనే సినిమా కోసం లేడీ గెటప్ వేసి చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు.

Advertisement

also read:రజనీకాంత్ కు ఆ ఒక్క విషయంలో ఇంత అవమానం జరిగిందా..?

సినిమా మొత్తం చూశాక ఈ పాత్ర వేసింది కమలహాసనే అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఏ కోణంలో చూసినా కమలహాసన్ అనే ఫీల్ కల్పించలేదు అంటూ నోరెళ్లపెట్టారు. అంతేకాకుండా తన అందంతో అందరినీ మైమరిపించిన మరో హీరో గోవిందా. పాతిక సంవత్సరాల క్రితం ఆంటీ నెంబర్ 1 అనే చిత్రంలో ఫుల్ లెన్త్ లేడీ రోల్ చేసిన గోవిందా అద్భుతంగా నటించడం మాత్రమే కాకుండా తన గెటప్ కూడా అదిరిపోయింది. ఈ విధంగా ఈ ఇద్దరు నటులు లేడీ గెటప్స్ లో చేయడంతో వారిని వారి అభిమానులు కూడా గుర్తుపట్టలేకపోయారు.

also read:తాతకు తగ్గ మనవరాలు బ్రాహ్మణి.. నందమూరి, నారా ఫ్యామిలీ పేరు ఎలా కాపాడుతోందంటే..?

Visitors Are Also Reading