Home » ఆ యాంక‌ర్ కోసం ప‌డి చ‌స్తున్న హీరోలు

ఆ యాంక‌ర్ కోసం ప‌డి చ‌స్తున్న హీరోలు

by Bunty
Ad

ఈ మ‌ధ్య కాలంలో హీరోలు ఒక యాంక‌ర్ కోసం ప‌డి చ‌స్తున్నారు. ఆమె ఉంటెనే త‌మ ఫ్రీ రిలిజ్ ఫంక్ష‌న్ ల తో పాటు ఇత‌ర ఈవెంటులు చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు. ఆమె నే సుమ క‌న‌కాల‌. యాంకర్ సుమ క్రేజ్ మాములు గా ఉండుదు. ఆమె ఎలాంటి షో చేసినా.. ఏ సినిమా కు ఫ్రి రిలీజ్ ఈవెంట్ చేసినా.. అది సూప‌ర్ హిట్ అవుతుంది. దీంతో ఆ షో కు లేదా ఆ సినిమా ఫ్రి రిలీజ్ ఈవెంటు కు త‌ప్ప‌ని స‌రిగా యాంక‌ర్ గా సుమ‌నే ఎంచు కుంటారు.

Advertisement

Advertisement

నిజానికి అది త‌మ సెంటిమెంట్ గా కూడా భావిస్తారు. నిజానికి యాంక‌ర్ సుమ ఫ్రి రిలీజ్ ఈవెంట్ ల‌కు యాంక‌ర్ గా చేసిన సినిమాలు అన్ని కూడా దాదాపు అన్నీ కూడా సూప‌ర్ హిట్ సాధించాయి. దీంతో యాంక‌ర్ సుమ సెంటిమెంట్ ప‌రంగా చాలా డిమాండ్ పెరిగింది. యాంక‌ర్ సుమ డేట్స్ చూసుకుని మ‌రీ.. త‌మ ఫ్రీ రిలీజ్ ఈవెంటు ల‌ను పెడుతున్నారు. ఈ విష‌యం పై తాజా గా నేచుర‌ల్ స్టార్ నాని కూడా ఒక సంద‌ర్భంలో ప్ర‌స్తావించాడు. శ్యామ్ సింగ‌రాయ్ ఈవెంటు లో హీరో నాని మాట్లాడుతూ తాము యాంక‌ర్ సుమ డేట్స్ ఖాళీ గా ఉన్నాయా… లేదా అని తెలుసుకుని మ‌రీ.. త‌మ ఈవెంటుల‌ను, ప్రెస్ మీట్ ల‌ను ప్లాన్ చేసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

యాంక‌ర్ సుమ డేట్స్ ఖాళీ గా ఉంటేనే త‌మ ఈవెంట్స్ ను ప్లాన్ చేసుకుంటామ‌ని తెలిపారు. త‌న తో పాటు చాలా మంది హీరోలు కూడా సుమ డేట్స్ కోసం చాలా ఎదురు చూస్తార‌ని అన్నారు. కాగ యాంక‌ర్ గా సుమ ను దాదాపు తెలుగు ప్ర‌జ‌లు అంద‌రూ కూడా ఆద‌రిస్తున్నారు. దీంతో ఆమె డిమాండ్ చాలా పెరిగింది.

Visitors Are Also Reading