తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయి దాదాపు 11 రోజులు దాటిపోయింది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ చాలామంది రాజకీయ ప్రముఖులు, సినీ తారలు అలాగే వ్యాపారవేత్తలు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళ్ స్టార్ హీరో విశాల్ కృష్ణారెడ్డి స్పందించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ … కీలక వ్యాఖ్యలు చేశాడు హీరో విశాల్ కృష్ణారెడ్డి. ఇటీవల కాలంలోనే హీరో విశాల్ మార్క్ ఆంటోనీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇవాళ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడని.. చంద్రబాబు వంటి వారికే అలాంటి పరిస్థితి వస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి ? అంటూ ప్రశ్నించారు విశాల్.
చంద్రబాబు అరెస్టు చాలా దారుణమని… చంద్రబాబుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అని హీరో విశాల్ కృష్ణారెడ్డి మీడియా వేదికగా వెల్లడించారు. కాగా హీరో విశాల్ ది కుప్పం నియోజకవర్గం అన్న సంగతి తెలిసిందే. కానీ పూర్వమే కుప్పం వదిలేసి తమిళనాడులో విశాల్ కుటుంబం సెటిల్ అయింది. అప్పట్లో విశాల్ వైసీపీ పార్టీలోకి వెళ్తున్నారని… నారా చంద్రబాబుపై పోటీ చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- Asia Cup 2023 : ఆసియా కప్పు తీసుకొచ్చి ఇతని చేతుల్లో పెట్టారు! ఎవరితను?
- బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టిన వసీం అక్రమ్ ! ఇది సరైనదే అంటారా ?
- మహమ్మద్ సిరాజ్ పై శ్రద్ధాకపూర్ సీరియస్.. ఎందుకు ఇలా చేశావంటూ ?