Home » బాబుపై పోటీపై విశాల్‌ సంచలన ప్రకటన..కుప్పంలో నాకు చాలా వ్యాపారాలంటూ !

బాబుపై పోటీపై విశాల్‌ సంచలన ప్రకటన..కుప్పంలో నాకు చాలా వ్యాపారాలంటూ !

by Bunty
Ad

తెలుగు ఇండస్ట్రీలో హీరో విశాల్ అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా హీరో విశాల్ మంచి గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం ఈ రెండు ఇండస్ట్రీలలో స్టార్ హీరోగా కొనసాగుతున్న విశాల్ హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఎ. వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘లాఠి’. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

ఈ సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్డిహెచ్ఆర్ కళాశాలల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లు నిర్వహించారు. అయితే, లాఠి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ సీఎం జగన్. సీఎం జగన్ అంటే ఇష్టం నా గుండెల్లో నుంచి వస్తుంది. నేను ఓటు వేయాల్సి వస్తే, వైఎస్ జగన్ కు తప్ప మరెవరికి వేయను. అయితే, సీఎం జగన్ అంటే ఇష్టం ఉన్న, నేను వైసీపీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు హీరో విశాల్‌.

Advertisement

ఏపీ రాజకీయాల్లోకి రావడం లేదు. మాకు కుప్పంలో చాలా వ్యాపారాలు ఉన్నాయి. కుప్పంలో ప్రతిదీ నాకు తెలుసు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన నాకు అస్సలు లేదు’ అని అన్నారు. ఒకవేళ ఓటు వేయాల్సి వస్తే వైఎస్ జగన్ కు తప్ప మరెవరికి వేయనని కుండబద్దలు కొట్టారు. ఇక తాను ఏపీ రాజకీయాల్లోకి రావడం లేదని హీరో విశాల్ స్పష్టం చేశారు. దాంతో ఏపీలోని కుప్పంలో విశాల్ పోటీ చేస్తారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పడింది.

Read also : అరుదైన ఫోటో షేర్‌ చేసిన వైఎస్‌ షర్మిల.. మోడ్రన్‌ లుక్‌ అదిరిపోయిందిగా !

Visitors Are Also Reading