సినీ ఇండస్ట్రీలో ఒకేసారి ఎంతో ఎత్తుకు ఎదిగి టక్కున మళ్లీ పాతాళానికి పడిపోయి కనిపించకుండా పోతారు. అలాంటి వారు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరిలో వేణు తొట్టెంపూడి ఒకరు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన సినీ జీవితం ఇలా అర్థాంతరంగా ఆగిపోవడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం.
స్వయంవరం మూవీతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వేణు వరుస హిట్లతో కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు కూడా సంపాదించారు. కానీ ఆ తర్వాత సినిమాలు అంతగా విజయవంతం కాకపోవడంతో తన భార్యతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేసారు. వేణు 2001లోనే అనుపమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అనుపమ ఎంబీఏ పూర్తి చేసి బిజినెస్ రంగంలోకి వెళ్ళింది. వేణు కూడా ఆమెతోపాటు బిజినెస్ లోకి దిగాడు.
Advertisement
Advertisement
అయితే వేణు అలా పోవడానికి ప్రధాన కారణం ఏ స్టోరీ పడితే ఆ స్టొరీ ని సెలెక్ట్ చేసుకొని సినిమాల్లోకి వెళ్లడం వల్ల అలా జరిగి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరో రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే మామూలుగా ఆర్టిస్టులు దర్శకనిర్మాత దగ్గరికి వెళ్లి ఛాన్స్ ఇవ్వమని అడుగుతారు. కానీ వేణు మాత్రం ఏ దర్శకుడి నిర్మాతల దగ్గరకు కూడా వెళ్లి ఛాన్స్ ఇవ్వమని అడగలేదు. తనను వెతుక్కుంటూ వచ్చిన పాత్రలు మాత్రమే చేస్తాడట. ఇది కూడా అతనికి ఉన్న ఒక మైనస్ పాయింట్ అని చెబుతారు సన్నిహితులు.
ALSO READ:
పూర్తిగా మారిపోయిన నాగబాబు…అందుకోసమేనా..?
ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్.. ఎప్పటినుంచి అంటే..?