టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొని విక్టరీ అనే బిరుదును సొంతం చేసుకున్న వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా సొంత టాలెంట్ తో స్టార్ హీరో స్టేజ్ కి ఎదిగారు. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి తెలియని కొన్ని విషయాలు, అలాగే ఆయన ఆస్తుల విలువ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1986 ఆగస్టు 14న రిలీజ్ అయిన కలియుగ పాండవులు అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన వెంకటేష్ 34 సంవత్సరాల సినీ కెరియర్ ని ఇంకా కొనసాగిస్తున్నారు.
మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డును కూడా అందుకున్న వెంకటేష్, 1971లో రిలీజ్ అయిన ఎన్టీఆర్ ప్రేమ్ నగర్ లో బాల నటుడిగా కూడా కనిపించారు. ఇకపోతే తన సినిమాల ద్వారా భారీ విజయాన్ని అందుకొని విక్టరీ అనే బిరుదును పొంది.. ఆ పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఇక 1987 మే 29వ తేదీన వెంకటేష్ నటించిన త్రిమూర్తులు, భారతంలో అర్జునుడు సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి. అయితే అప్పటికే స్టార్డం తెచ్చుకోలేదు వెంకటేష్. ఆ తర్వాత బొబ్బిలి రాజా సినిమాతో భారీ స్టార్డం సంపాదించుకున్నారు. ఇక బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈయన ఆ తర్వాత ఉత్తమ నటుడిగా ఐదు నంది అవార్డులను కూడా సొంతం చేసుకోవడం గమనార్హం.
Advertisement
అంతేకాదు టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలకు ఊపు తీసుకొచ్చిన నటుడు కూడా ఈయనే. అలా చాలామంది హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేసి భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. నీరజారెడ్డిని వివాహం చేసుకున్న ఈయనకు నలుగురు సంతానం ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి కాగా గత ఏడాది పెద్ద కూతురికి ఘనంగా వివాహం జరిపించారు. మరొకవైపు తన తండ్రి ప్రఖ్యాత రామానాయుడు ఏర్పాటు చేసిన సురేష్ ప్రొడక్షన్స్ స్టూడియోలో తన అన్నతో పాటు ఈయన కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక వెంకటేష్ ఆస్తి విషయానికి వస్తే.. రూ. 2 వేల కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న ఈయన తన తండ్రి నుంచీ వారసత్వంగా కూడా ఆస్తులు లభించినట్లు తెలుస్తోంది. మొత్తంగా వెంకటేష్ ఆస్తుల విలువ రూ.3 వేల కోట్లకు పై మాటే అని చెప్పవచ్చు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!