Home » పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న హీరో తరుణ్…?

పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న హీరో తరుణ్…?

by Bunty
Ad

ఒకప్పటి స్టార్ హీరో తరుణ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లవర్ బాయ్ గా ప్రేమకథ చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. చిన్ననాటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. హీరోగా తన మొదటి చిత్రం ‘నువ్వే కావాలి’. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు ఆ సినిమా అనంతరం ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. ఇప్పటికీ తరుణ్ నటించిన సినిమాలు వస్తే ప్రతి ఒక్క ప్రేక్షకులు సినిమా చూస్తూ ఉంటారు. ఇక ఏమైందో తెలియదు కొన్ని రోజులకి తరుణ్ సినిమాల నుంచి తప్పుకున్నారు.

Hero Tarun is going to be a father without marriage

మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకప్పుడైతే సినిమాల్లో రాణించాడు కానీ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అని అనుమానంతో కూడా ఉన్నాడు తరుణ్. ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించిన తరుణ్ అలాగే కంటిన్యూ అయి ఉంటే ఇప్పుడు పెద్ద హీరో అయ్యేవాడు. తాను సినిమాల నుంచి తప్పుకోవడానికి గల కారణం తన ప్రేమ విఫలం అవ్వడమట. తన లవ్ బ్రేకప్ అయ్యిందన్న బాధతో సినిమాలకు పూర్తిగా తరుణ్ దూరమయ్యాడని వార్తలు వస్తున్నాయి. కానీ తరుణ్ ఇప్పటివరకు ఆ విషయాన్ని ఎప్పుడూ ప్రకటించలేదు.

Advertisement

tarun-and-aarthiagawal-love

Advertisement

ఇక తరుణ్ పెళ్లికి సంబంధించి కూడా ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ తాను ఇంతవరకు వివాహం చేసుకోలేదు. కానీ ఈ మధ్యకాలంలో తరుణ్ పెళ్లి కాకుండానే తండ్రి అవుతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే తాను ఓ సినిమాలో ఆరేళ్ల పాపకి తండ్రి పాత్రలో నటించబోతున్నాడట. తరుణ్ సరసన మీరాజాస్మిన్ తల్లి పాత్రలో నటించబోతుందట. ఈ సినిమాతో తరుణ్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్నమాట. ఇక తరుణ్ ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading