Home » బర్రెలక్కకు పెరుగుతోన్న సపోర్ట్… టాలీవుడ్ హీరో కూడా బర్రెలక్కకు మద్దతు…!

బర్రెలక్కకు పెరుగుతోన్న సపోర్ట్… టాలీవుడ్ హీరో కూడా బర్రెలక్కకు మద్దతు…!

by Sravya
Ad

ప్రస్తుతం ఎక్కడ చూసినా బర్రెలక్క టాపిక్ ఏ నడుస్తోంది. ఉద్యోగం రాలేదని, అందుకే బర్రెలు కొనుక్కున్నాను అని కామెడీ చేస్తూనే ఆమె సెటైర్లు కూడా వేస్తోంది. ఇలా ఆమె పాపులర్ అయిపోయింది. శిరీష ఎన్నో కష్టాలని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమెపై కేసు కూడా నమోదయింది. అయినా కూడా వెనకడుగు వేయలేదు. ఈసారి ఏకంగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో ఈమె నిలిచింది. కొల్లాపూర్ నియోజక వర్గం నుండి ఇండిపెండెంట్ క్యాండెట్ గా బరిలోకి బర్రెలకు దిగింది.

Advertisement

ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తోంది. తాజాగా బర్రెలకు ఎన్నికల ప్రచారం చేస్తుండగా కొంతమంది ఆమె తమ్ముడు పై దాడి చేశారు ఆ విషయం కాస్త రచ్చగా మారిపోయింది. తనని ప్రచారం కూడాచేసుకోనివ్వలేదు. కన్నీరు పెట్టుకుంది బర్రెలక్క. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శిరీషకి సపోర్ట్ కూడా పెరిగింది చాలామంది ప్రముఖులు బర్రెలక్కకి పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు గెలిస్తే, రాజకీయాల్లో మార్పు వస్తుందని కూడా అంటున్నారు.

Advertisement

కొంతమంది అయితే, బర్రెలకు కి విరాళాలు కూడా ఇస్తున్నారు. తాజాగా హీరో రాజా కూడా శిరీషకి సపోర్ట్ ఇచ్చారు. రాజా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అనే విషయం మనకి తెలుసు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అధిష్టానం మందలించినా సపోర్ట్ మాత్రం ఆమెకే అని రాజా ఆసక్తికరమైన విషయాలని చెప్పారు. అలానే శిరీష గెలవాలని కోరుకుంటున్నట్లు కూడా రాజా అన్నారు. కనీసం ఆమెను ప్రచారం కూడా చేసుకోనివ్వట్లేదని రాజా ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలి అని అన్నారు. ఇలాంటి వాళ్లు గెలిస్తే యువతలో కొత్త చైతన్యం వస్తుందని అన్నారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading