టాలీవుడ్ ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు ఒకప్పుడు పెద్ద దిక్కుగా ఉండి.. అన్ని తానే వ్యవహరించే వారు. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి దాసరి తరువాత పెద్ద అనుకుంటున్న తరుణంలోనే సీనీ పరిశ్రమకు పెద్దగా తానుండను, గొడవలు పెట్టుకునేవారికి పంచాయితీ చెప్పను అని.. కేవలం కార్మికులకు సాయం చేస్తానని ప్రకటించారు చిరంజీవి.
Advertisement
చిరంజీవి కామెంట్స్ చేసిన కొద్ది సేపటికీ మోహన్‌బాబు బహిరంగ లేఖ రాసి అందరినీ ఆశ్యర్యపరిచారు. పెద్దరికం గురించి ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హీరో సుమన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. సినిమా టికెట్ల సమస్యను అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.
Advertisement
అయితే సినిమా రంగంలో ఐక్యత లేదనడం వాస్తవం కాదు. కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి సీనియర్లున్నారని వారి సలహా కూడా తీసుకోవాలి. ఇండస్ట్రీలో ఏ ఒక్కరికో పెద్దరికం ఇవ్వడం సరికాదు అన్నారు. రాజకీయాలు ఇప్పుడు నేను మాట్లాడను అని సుమన్ తెలిపారు.
ముఖ్యంగా కరోనా తరువాతనే ఈ సమస్యలు వచ్చాయి అని.. ఇలాంటి సమయంలో ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుందన్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నిర్ణయాలు ఒకే విధంగా బాగుంటుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఎవ్వరినీ టార్గెట్ చేయడం లేదన్నది నా అభిప్రాయమన్నారు సుమన్. సీఎం బిజీగా ఉంటే ఒకటికీ రెండు సార్లు కలిసి సమస్యను వివరించి పరిష్కరించుకోవాలి.