Home » హీరో సుహాస్ భార్య ఎవరో తెలుసా… వాళ్ళ లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్టులు..!

హీరో సుహాస్ భార్య ఎవరో తెలుసా… వాళ్ళ లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్టులు..!

by AJAY
Published: Last Updated on
Ad

షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించి ప్రస్తుతం టాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్. ఒకప్పుడు యూట్యూబ్ లో సుహాస్ షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు. సుహాస్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ కు మంచి క్రేజ్ రావడంతో ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు. పడి పడి లేచే మనసు, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి చిత్రాలలో సుహాస్ ముఖ్యమైన పాత్రలలో నటించాడు.

Also Read: విజయ్ దేవరకొండ సమంత కండిషన్స్.. కారణం అదేనా.!

Advertisement

 

ఆ తరవాత సుహాస్ హీరోగా కలర్ ఫోటో అనే సినిమాలో నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఓటిటిలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో సుహాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక తాజాగా సుహాస్ రైటర్ పద్మభూషణ్ అనే సినిమాలో నటించాడు.

Advertisement

ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సుహాస్ సినిమా లైఫ్ గురించి చాలా మందికి తెలుసు కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. సుహాస్ లలిత అనే యువతిని ప్రేమించాడు. చాలా కాలం పాటు వీరిద్దరూ ప్రేమించుకోగా పెళ్లికి మాత్రం కుటుంబ సభ్యులు నో చెప్పారు. దాంతో సుహాస్ స్నేహితుల మధ్యన తను ప్రేమించిన లలితను గుడిలో వివాహం చేసుకున్నారు.

ఇక ప్రస్తుతం సుహాస్ లలితలు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు. సుహాస్ తన భార్యతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఓ ఇంటర్వ్యూలో తన భార్య గురించి చెబుతూ… తాను ఫ్యామిలీ డ్రామా అనే సినిమాలో నటించినప్పుడు ఆ సినిమా చూసి తన భార్య భయపడిందని చెప్పాడు. అంతేకాకుండా మూడు రోజులు ఆఫీసులోనే పడుకోవాలని ఇంటికి రావద్దని చెప్పిందని అన్నాడు.

Also Read: 2.5 రేటింగ్ తో 2.5 మిలియన్ కలెక్షన్స్ కొట్టి చూపించానంటున్న చిరంజీవి

Visitors Are Also Reading