టాలీవుడ్ లో హీరో శ్రీకాంత్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ చిత్రాలతో శ్రీకాంత్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక శ్రీకాంత్ ప్రస్తుతం హీరోగా కాకుండా విలన్ పాత్రలు మరియు పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీకాంత్ ఒకప్పుడు ఎన్టీరామారావు, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమా రికార్డులను సైతం బద్దలు కొట్టారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…ఎలాంటి అంచనాలు లేకుండా శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన సినిమా పెళ్లి సందడి. ఈ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు.
Advertisement
1996లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా కంటే ముందు రాఘవేంద్రరావు భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించారు. అయితే సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన హమ్ ఆప్ కు హై కోన్ సినిమా చూసిన తరవాత రాఘవేంద్రరావు అలాంటి సినిమా చేయాలని అనుకున్నారు. వెంటనే కథా రచయిత సత్యానంద్ ను పిలిపించి తన ఆలోనలను చెప్పారు. పాటలు కూడా కథలో భాగం అవ్వాలని రాఘవేంద్రరావు సూచించారు. ఇక సత్యానంద్ ఏఎన్ఆర్ చేసిన పెళ్లి కానుక సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకుని పెళ్లిసందడి కథను రాశారు.
Advertisement
కథను రాఘవేంద్రరావుకు వినిపించగా ఆయనకు తెగనచ్చేసింది. 80లక్షల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. ఈ సినిమా నిర్మించడం కోసం మొదట నిర్మాత అల్లు అరవింద్ ను సంప్రదించారు. కానీ ఆయన ఎక్కువ బడ్జెట్ అని చిన్న సినిమా అని నలుగురం కలిసి చేద్దామని చెప్పారు. అలా ఈ సినిమాను రాఘవేంద్రరావు, అశ్వినిదత్, అల్లు అరవింద్ మరో నిర్మాత భాగ్వమ్యంలో నిర్మించారు. తాజ్ మహల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ను హీరోగా ఎంపిక చేశారు.
వివిధ రాష్ట్రాలలో సినిమాను చిత్రించారు. కీరవాణి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు మరో హైలెట్ గా నిలిచింది. 44 కేంద్రాలలో 50 రోజులు 33 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. ఇక ఎన్టీఆర్ లవకుశ సినిమా 27 కేంద్రాలలో 100రోజులు ఆడగా ఆ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. ఎక్కువ షోలు ఆడి చిరంజీవి రికార్డులను కూడా బద్దలు కొట్టింది. ఇప్పటికీ ఎక్కువ షోలు ఆడిన సినిమా కూడా పెళ్లిసందడే…ఆ రికార్డును ఇంకా ఎవరూ బ్రేక్ చేయలేదు.
ALSO READ :
ఎన్టీఆర్ కి RRR లో నిజంగానే అన్యాయం జరిగిందిగా ! మరి ఇదేంటి జక్కన్నా ?
రావు గోపాల్ రావ్ వాయిస్ విని మొదట్లో దర్శకనిర్మాతలు ఏమని అవమానించారో తెలుసా ? కట్ చేస్తే..!