Home » హీరోయిన్ తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్…జీవితాంతం ఆమె తోనే అంటూ..!

హీరోయిన్ తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్…జీవితాంతం ఆమె తోనే అంటూ..!

by AJAY
Ad

హీరో సిద్ధార్థ్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో లవర్ బాయ్ గా సిద్ధార్థ్ గుర్తింపు సంపాదించుకున్నాడు. నిజానికి కోలీవుడ్ హీరో అయినప్పటికీ సిద్ధార్థ్ కు తెలుగులోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. సిద్ధార్థ్ నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలు తెలుగులో బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. తాజాగా సిద్ధార్థ్ టక్కర్ అనే సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా కంటే ముందు సిద్ధార్థ్ మహాసముద్రం అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ చిత్రంలో హీరోయిన్ గా అదితి రావు హైదారి నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయం నుండి సిద్ధార్థ్ అదితి రావు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబైలో ఇద్దరు కలిసి మీడియాకు కూడా దొరికిపోయారు. అంతేకాకుండా అప్పట్లో శర్వానంద్ ఎంగేజ్మెంట్ లో వీరిద్దరూ జంటగా కనిపించారు.

Advertisement

siddarth

siddarth

అదేవిధంగా రీసెంట్ గా శర్వానంద్ పెళ్లికి కూడా సిద్ధార్థ్ అదితి రావు జంటగా వెళ్లారు. దాంతో వీరి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ ను యాంకర్ మీరు జీవితాంతం ఎవరితో డాన్స్ చేయాలని అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించింది. దానికి సిద్ధార్థ్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు.

Actor Siddarth

Actor Siddarth

“మా ఊర్లో అందరూ అతిధి దేవోభవ అంటారు కదా” అంటూ ఆన్సర్ ఇచ్చాడు. దాంతో సిద్ధార్థ్ పరోక్షంగా అదితిని అతిధి అంటూ చెప్పాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సిద్ధార్థ్ మామూలోడు కాదని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే సిద్ధార్థ్ కు ఇప్పటికే వివాహమై విడాకులు కూడా అయ్యాయి. అంతేకాకుండా గతంలో సమంతతో కొంతకాలం ప్రేమాయణం కూడా నడిపించాడు. అదేవిధంగా శృతిహాసన్ తో కూడా కొంతకాలం ప్రేమలో మునిగితేలాడు.

Visitors Are Also Reading