Home » ఆ స్టార్ హీరోయిన్ కి రానా క్షమాపణలు.. కారణం అదేనా ? 

ఆ స్టార్ హీరోయిన్ కి రానా క్షమాపణలు.. కారణం అదేనా ? 

by Anji
Ad

టాలీవుడ్ హీరో  రానా దగ్గుబాటి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. గత కొంత కాలంగా  రానా నుంచి కొత్త సినిమా అప్డేట్ రావడం లేదు. దీంతో ఆయన అభిమానులు అందరూ కాస్త నిరాశలో ఉన్నారు. చివరిగా రానా వెంకటేష్ తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ లో కనిపించాడు. ఇక ఈ వెబ్ సిరీస్ మిక్స్డ్ టాక్ ని దక్కించుకుంది. అదేవిధంగా సోలో హీరోగా చివరిగా విరాటపర్వం మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లానాయక్ మూవీలో నటించాడు. ఇటీవల యంగ్ హీరో నిఖిల్ నటించిన స్పై సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు.

Advertisement

ఇదిలా ఉండగా.. రానా తాజాగా ఓ హీరోయిన్ కి క్షమాపణలు చెప్పారు. ఇటీవలే రానా ఆ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. దీంతో ఆమెకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల జరిగిన ఓ ప్రి రిలీజ్ ఈవెంట్ కి జూ గెస్ట్ గా హాజరయ్యాడు రానా. దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోత అనే మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ఈ తరుణంలోనే ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నాని, రానా గెస్ట్ లుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. దుల్కర్ నుంచి యాక్షన్ సినిమా వస్తుందంటే నేను చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. బాలీవుడ్ లో దుల్కర్ ఓ సినిమాలో నటించాడు.

Advertisement

ఆ సినిమా నిర్మాతలు నా స్నేహితులు కావడంతో ఆ సినిమా షూటింగ్ కి నేను వెళ్లాను.. షాట్ మధ్యలో ఆ హీరోయిన్ ఫోన్ లో తన భర్తతో షాపింగ్ గురించి మాట్లాడుతుంది. దుల్కర్ మాత్రం ఓపికగా అక్కడే ఎండలో నిల్చొని ఉండిపోయాడు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రానా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాల వైరల్ గా మారాయి. ఇక ఆ హీరోయిన్ సోనమ్ కపూర్ అంటూ ఆమెపై కొందరూ ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. దుల్కర్, సోనమ్ కలిసి ఓ సినిమాలో నటించిన విషయం విధితమే. రానా చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో సోనమ్ కి, దుల్కర్ కి రానా క్షమాపణలు చెబుతూ ఓ ట్వీట్ షేర్ చేశాడు. దుల్కర్, సోనమ్ కపూర్ కలిసి జోయా ఫ్యాక్టర్ అనే మూవీలో నటించాడు. ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా దుల్కర్ నటిస్తున్న కింగ్ ఆఫ్ కోత పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు 

షారూఖ్ ఖాన్ నుంచి అల్లు అర్జున్ వరకు.. భారత్ లో టాప్ 10 రిచ్ హీరోలు ఎవరో తెలుసా ? 

Jailer : జైలర్ సినిమాలో ఇరగదీసిన ఈ విలన్ ఎవరో తెలుసా? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

Visitors Are Also Reading