తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తెలియని వారు ఉండరు.. ఆరుపదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు తీస్తూ తన స్టార్ డం కొనసాగిస్తున్నాడు.. అలా అని రజనీకాంత్ ఆరడుగుల అందగాడు, ఎర్రగా బుర్రగా ఉన్న హీరో కానే కాదు.. అయినా ఆయనకు కోట్లాదిమంది ఫ్యాన్స్.. దీనికి ప్రధాన కారణం ఆయన నటన టాలెంట్.. నటించడంలో ఆయనకున్న స్టైలే వేరు.. ఇదే రజనీకాంత్ ను ఇంతటి స్టార్ ను చేసింది.. అలాంటి రజినీకాంత్ సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు అనేక పనులు చేశారు.. చివరికి బస్ కండక్టర్ కూడా చేశాడు.. ఈ తరుణంలోనే ఆయన అప్పుడప్పుడు కొన్ని నాటకాలు వేసేవారట..
Advertisement
also read:పిల్లలకు భోజనం పెట్టి వస్తానని అత్తమామలకు చెప్పి వెళ్లిన కోడలు..అంత పని చేసిందేంటి..!!
రజనీకాంత్ రామకృష్ణ మఠంలో చదువుకునే రోజుల్లో వేద పురాణం నాటకాల్లో నటించేవాడు.. దీనివల్ల ఆయనకు నటనపై ఆసక్తి కలిగింది.. దీంతో బస్ కండక్టర్ జాబును వదులుకొని మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు.. అలా ఒక డ్రామాలో దుర్యోధనుని పాత్ర చేసి దర్శకుడు కే బాలచంద్రాన్ని ఆకట్టుకున్నాడు.. ఈ విధంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. అలా అంచలంచలుగా ఎదిగాడు, సూపర్ స్టార్ అయ్యాడు.. కట్ చేస్తే సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు అతిలోకసుందరి శ్రీదేవి కాంబినేషన్ కు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. వీరి మధ్య ఏదో నడుస్తుందని కూడా పుకార్లు పుట్టాయి.. దాదాపు 25 పైగా సినిమాల్లో నటించారు మీరు.. రజినీకాంత్ అంటే శ్రీదేవికి ఎనలేని ప్రేమ..
Advertisement
2011 “రానా” సినిమా షూటింగ్ లో పాల్గొన్న సమయంలో ఆయన అనారోగ్యం బారిన పడ్డాడు. సీరియస్ కావడంతో సింగపూర్ తీసుకెళ్లాల్సి వచ్చింది.. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీదేవి ఒక్కసారిగా విలపించిందట.. రజనీకాంత్ ఆరోగ్యం మెరుగుపడాలని షిరిడి వెళ్లి దర్శించుకొని ఆయన ఆరోగ్యం కోసం ఏడు రోజుల పాటు ఉపవాస దీక్ష కూడా చేసిందట.. దీంతో రజనీకాంత్ పూర్తిగా కోలుకొని ఇండియాకు వచ్చారు.. వచ్చిన వెంటనే శ్రీదేవి తన భర్త బోనికపూర్ తో కలిసి రజనీకాంత్ దగ్గరికి వెళ్లి ఆరోగ్యం విషయాలు తెలుసుకుందని ఒకానొక ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ రజినీకాంత్ గుర్తు చేసుకున్నారు.. అలాంటి సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా మరోసారి యాదిలో..!!
also read: