క్షణికావేశం అనేది ఎన్నో అనార్థాలకు దారి తీస్తుందనేది కొన్ని కొన్ని కథనాలు చూసినప్పుడు అనిపిస్తుంది.. ముఖ్యంగా ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.. ఈ మధ్యకాలంలో ఇక్కడ చూసిన ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.. ఆలోచన లేకుండా చేసిన పనులు చిన్న చిన్న పిల్లలను అనాథలను చేస్తున్నాయి.. అలాంటి ఘటనే తెనాలిలో చోటుచేసుకుంది.. వివరాలు ఏంటో చూద్దాం.. భర్త బెంగళూరు పని నిమిత్తం వెళ్ళాడు.. దీంతో ఆయన భార్య ఇంట్లోనే ఉంది.. అత్తమామలు కూడా ఇంట్లోనే ఉన్నారు.. మధ్యాహ్న సమయం కావస్తోంది.. దీంతో సదరు వివాహిత స్కూల్ కి వెళ్లి పిల్లలకు భోజనం పెట్టి వస్తానని ఇంట్లో ఉన్న అత్త మామలకు చెప్పి వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని ఐతా నగర్ లో సంచలనం సృష్టించింది.. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Advertisement
also read:NRI లను పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ 6 మంది టాలీవుడ్ హీరోయిన్లు వీళ్లే
Advertisement
గాంధీనగర్ పయనీర్ అపార్ట్మెంట్ లో నివాసముండే పిన్నెల్లి గాయత్రి 33 ఏళ్లు.. కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు.. రెండు రోజుల క్రితం భర్త పనుల నిమిత్తం బెంగళూరు వెళ్ళాడు.. ఇంట్లో అత్తమామలు మాత్రమే ఉన్నారు.. స్కూల్ కెళ్ళి పిల్లలకు అన్నం పెట్టి వస్తానని అత్తమామలకు చెప్పి ఐత నగర్ లోని ఎలక్ట్రిషన్,కార్ డ్రైవర్ గా పని చేసే పవన్ 24 ఏళ్లు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. వీరి మధ్య చాలా రోజుల నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతుందట. అయితే గాయత్రి పవన్ ఇంటికి వెళ్లిన సమయంలో పవన్ తల్లి ఇంట్లోనే ఉంది.. గాయత్రి ఫోన్ చేస్తున్న గత కొన్ని రోజులుగా పవన్ లిఫ్ట్ చేయట్లేదు..
ఇదే విషయమై పవన్ ఇంటిదగ్గర వీరిద్దరికీ వివాదం జరిగింది.. ఇది కాస్త తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పవన్ మరియు అతని తల్లి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు.. దీంతో గాయత్రి వారి ఇంట్లోనే లోపల గడియ పెట్టుకొని ఫ్యానుకు ఉరివేసుకుంది.. తలుపు ఎంతకీ తీయకపోవడంతో పవన్ వెనుక గడి నుంచి పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి ఉరి వేసుకొని ఉంది.. ఇరుగుపొరుగు సాయంతో ఆమెను కిందికి దించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.. దీంతో మృతురాలి భర్త శివప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
also read: