యంగ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు పొందినటువంటి హీరో రాజ్ తరుణ్. ఆయన మొదటిసారి చేసిన సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఉయ్యాల జంపాల మూవీతో హీరో గా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రాజు తరుణ్ ఒక్క సినిమాతోనే మంచి హీరోగా గుర్తింపు పొందారు. దీని తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు రాజ్ తరుణ్. ఆ తర్వాత సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్, సినిమాలు హీరో రాజు తరుణ్ కి మరింత గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ అవి ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. దీంతో రాజ్ తరుణ్ సినీ కెరియర్ కాస్త డల్ అయిపోయింది అని చెప్పవచ్చు.
ఈ సందర్భంలోనే ప్రముఖ కమెడియన్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాజ్ తరుణ్ బెస్ట్ ఫ్రెండ్ అయినా రఘునందన్ రాజ్ తరుణ్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఒకానొక సందర్భంలో రాజ్ తరుణ్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనుకున్నాడు అంటూ షాకింగ్ విషయాన్ని చెప్పారు. దీంతో ఆయన చేసిన కామెంట్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారాయి. మరి ఆయన ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే లాక్ డౌన్ సమయం లో వారి కుటుంబ సభ్యులు అంతా చెన్నైలో చిక్కుకు పోయారట.
Advertisement
Advertisement
వారు 15 రోజుల్లో వస్తారని అనుకుంటే ఆ తర్వాత ఒక నెల, తర్వాత రెండు నెలలు ఈ విధంగా లాక్ డౌన్ పెరిగిపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తనతో లేకపోవడం కనీసం సినిమా షూటింగ్స్ కూడా లేకపోవడంతో తనకి పిచ్చెక్కి పోయిందని తన ఫ్రెండు రఘునందన్ కు ఫోన్ చేసి ఇంకొక వారం ఇలానే ఉంటే నేను ఏమైపోతానో నాకే తెలియదు నేను ఏమైనా చెయ్యొచ్చు అన్నాడట. ఆ మాటలు విన్న రఘునందన్ చాలా కంగారు పడ్డారని రాజ్ తరుణ్ పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే అతన్ని నా దగ్గరికి తీసుకు వచ్చాను అంటూ రఘునందన్ బయటపెట్టిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read;
హర్ష సాయికి అసలు అన్ని డబ్బులు ఎక్కడివి..? ఇతను ఏం చేస్తాడు..?
విమానంలో ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు…పూజా హెగ్డే ఎమోషనల్ పోస్ట్….!